టీ20 వరల్డ్ కప్ 2022: టాస్ గెలిచిన టీమిండియా... సెమీస్ ప్రత్యర్థిని తేల్చనున్న ఫలితం...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... జింబాబ్వేతో మ్యాచ్ గెలిస్తే టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సూపర్ 12 రౌండ్ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా, జింబాబ్వేతో తలబడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిపోవడంతో ఇప్పటికే టీమిండియా సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది. అయితే నేటి మ్యాచ్‌లో విజయం అందుకుంటే టేబుల్ టాపర్‌గా, విజయంతో గ్రూప్ స్టేజీని ముగుస్తుంది భారత జట్టు...
పాకిస్తాన్‌పై 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిదాకా పోరాడింది. దీంతో తేలిగ్గా తీసుకుంటే టీమిండియాకి షాక్ తగలడం గ్యారెంటీ. అదీకాకుండా ఐర్లాండ్ జట్టు, ఇంగ్లాండ్‌కి... నెదర్లాండ్స్ టీమ్, సౌతాఫ్రికాకి షాక్ ఇచ్చి... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సంచలనాలు నమోదు చేశాయి.
దీంతో టీమిండియా - జింబాబ్వే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో చూసినట్టుగా దాదాపు 90 వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
నేటి మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిస్తే నవంబర్ 10న ఇండియా, ఇంగ్లాండ్‌తో ఆడిలైడ్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.ఒకవేళ భారత జట్టుపై జింబాబ్వే విజయం అందుకుంటే నవంబర్ 9న ఇండియా, న్యూజిలాండ్ మధ్య సిడ్నీలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగుతుంది.
నేటి మ్యాచ్‌లో ఒకే ఒక్క మార్పుతో బరిలో దిగుతోంది టీమిండియా. మొదటి నాలుగు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్థానంలో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా యంగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ మరోసారి రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...
టీమిండియా: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
జింబాబ్వే: వెస్టీ మెదెవేర్, క్రెగ్ ఎర్వీన్, రగీస్ చక్‌బవా, సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనో మునోంగా, రియాన్ బర్ల్, టెండాయ్ చతరా, రిచర్డ్ నగరవా, వెల్లింగ్టన్ మజకడ్జ, బ్లెసింగ్ ముజరబానీ