టీ20 వరల్డ్ కప్ 2022: టాపార్డర్ ఫెయిల్! షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ హాఫ్ సెంచరీలు... సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..
T20 World cup 2022: హాఫ్ సెంచరీలు చేసిన ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్... సౌతాఫ్రికా ముందు 186 పరుగుల భారీ టార్గెట్!
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు అదర గొట్టారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 4 పరుగులు చేయగా కెప్టెన్ బాబర్ ఆజమ్ 15 బంతుల్లో 6 పరుగులు చేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.
గాయపడిన ఫకార్ జమాన్ ప్లేస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన మహ్మద్ హారీస్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుట్ కాగా షాన్ మసూద్ 6 బంతులాడి 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పాకిస్తాన్. ఈ దశలో ఇప్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్ కలిసి ఐదో వికెట్‌కి 52 పరుగులు జోడించారు. 22 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్, షంసీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత షాదబ్ ఖాన్, ఇప్తికర్ అహ్మద్ కలిసి ఆరో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్‌ని కగిసో రబాడా అవుట్ చేయగా షాదబ్ ఖాన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ అందుకున్నాడు...
టీ20ల్లో పాకిస్తాన్ తరుపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా షోయబ్ మాలిక్ తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు షాదబ్ ఖాన్. 2021 టీ20 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌పై షోయబ్ మాలిక్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే, షాదబ్ ఖాన్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకన్నాడు.
మహ్మద్ వసీం జూనియర్‌ని నోకియా డకౌట్ చేశాడు. అన్రీచ్ నోకియా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, 20వ ఓవర్ మొదటి బంతికి ఇప్తికర్ అహ్మద్ వికెట్‌ని కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి హారీస్ రౌఫ్ రనౌట్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 50 పరుగుల లోపే 4 వికెట్లు కోల్పోయిన తర్వాత 185 పరుగుల భారీ స్కోరు చేసిన జట్టుగా పాకిస్తాన్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రీచ్ నోకియా 4 వికెట్లు తీయగా కగిసో రబాడా, లుంగి ఇంగిడి, తబ్రేజ్ షంసీ, పార్నెల్ తలా ఓ వికెట్ తీశారు.