ఇండియా- పాక్ మ్యాచ్‌లో అభిమాని అత్యుత్సాహం... క్రీజులోకి వచ్చినందుకు లక్షల్లో ఫైన్ వేసిన ఆస్ట్రేలియా...

పాక్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో సెక్యూరిటీ కళ్లు గప్పి క్రీజులోకి వచ్చిన టీమిండియా అభిమాని... రూ.5 లక్షలకు పైగా జరిమానా విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా...

T20 World cup 2022: Huge Penalty for pitch invader during India vs Pakistan game

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ అభిమాని అత్యుత్సాహానికి పోయి లక్షల్లో ఫైన్ చెల్లించబోతున్నాడు. టీమిండియా బౌలింగ్ సాగుతున్న సమయంలో ఓ అభిమాని, సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. బౌలింగ్ వేస్తున్న భువనేశ్వర్ కుమార్ దగ్గరికి వెళ్లి, ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరాడు...

వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అతన్ని క్రీజు బయటికి తీసుకెళ్లారు. సెక్యూరిటీ కంచెను దాటి, క్రీజులోకి అడుగుపెట్టినందుకు సదరు క్రికెట్ ఫ్యాన్‌కి 9913.20 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అంటే భారీతీయ కరెన్సీలో దాదాపు 5 లక్షల 20 వేల రూపాయలకు పైగా ఫైన్ రూపంలో చెల్లించబోతున్నాడు సదరు క్రికెట్ అభిమాని...

ఈ విషయం పక్కనబెడితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యఛదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. 8 బంతుల్లో 4 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, నసీం షా బౌలింగ్‌లో అవుట్ కాగా 7 బంతుల్లో 4 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు....

10 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా హారీస్ రౌఫ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ గోల్డెన్ డకౌట్ కాగా, మహ్మద్ రిజ్వాన్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 15 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది పాకిస్తాన్. 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది పాకిస్తాన్.  

మూడో వికెట్‌కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇఫ్తికర్ అహ్మద్, 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

అదే ఓవర్ 4 బంతుల్లో 2 పరుగులు చేసిన హైదర్ ఆలీ కూడా హార్ధిక్ పాండ్యా ఓవర్‌లో ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 91/2 వద్ద ఉన్న పాకిస్తాన్ స్కోరు, 10 బంతుల వ్యవధిలో 98/5కి చేరుకుంది...

హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన మహ్మద్ నవాజ్, 9 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లలో 30 పరుగులిచ్చిన హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు... 3 బంతుల్లో 2 పరుగులు చేసిన అసిఫ్ ఆలీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షాన్ మసూద్ 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios