Asianet News TeluguAsianet News Telugu

సచిన్‌కు మరో గౌరవం.. బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్

Sachin Tendulkar: నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్  కు మరో అరుదైన గౌరవం దక్కింది.  

Sydney Cricket Ground honoured Sachin Tendulkar and Brian Lara on Special Day MSV
Author
First Published Apr 24, 2023, 3:04 PM IST

మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్‌ నేడు 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా సచిన్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)  అరుదైన గౌరవం అందించింది. ఎస్‌సీజీలోని  ఓ  గేటుకు సచిన్  పేరును పెట్టింది.  ఇదే క్రమంలో సచిన్ కు సన్నిహితుడు, అతడి స్నేహితుడు  వెస్టిండీస్ మాజీ సారథి బ్రియన్ లారాను కూడా ఇలాగే గౌరవించింది.   తద్వారా ఈ ఇద్దరూ  ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు  సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్,  అలన్ఖ డేవిడ్‌సన్ , ఆర్థర్ మోరిస్ సరసన నిలిచారు. 

సచిన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎస్‌సీజీ..   స్టేడియంలోకి విజిటింగ్ క్రికెటర్లు   ప్రవేశించే గేట్ కు సచిన్   పేరుపెట్టింది.  ఎస్‌సీజీలో    బ్రాడ్‌మన్ మెసేంజర్ స్టాండ్, మెంబర్స్ పెవిలియన్ మధ్యలో ఈ గేట్లు ఉన్నాయి.  విజిటింగ్ క్రికెటర్లు ఈ ద్వారం గుండానే  లోపలికి ప్రవేశిస్తారు. 

నాకెన్నో మధుర జ్ఞాపకాలు :  సచిన్ 

సచిన్  - లారాల పేర్లను  గేట్ కు పెట్టిన విషయాన్ని క్రికెట్.కామ్.ఏయూ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా  షేర్ చేసింది. ఇదే విషయమై సచిన్ స్పందిస్తూ.. ‘భారత్ తర్వాత  నాకు  ఇష్టమైన  క్రికెట్ గ్రౌండ్  ఎస్‌సీజీ.  నేను 1991-92లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి.విజిటింగ్ క్రికెటర్ల ప్రవేశద్వారమైన గేట్లకు నా, నా స్నేహితుడు బ్రియాన్ లారా పేరు పెట్టినందుకు   నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఎస్‌సీజీకి ధన్యవాదాలు.  నేను త్వరలోనే  సిడ్నీని సందర్శిస్తాను’అని పేర్కొన్నాడు.  

 

లారాకు ఎందుకు..? 

సచిన్ తో పాటు లారాకు కూడా ఇక్కడ  మధురమైన జ్ఞాపకాలున్నాయి.  లారా  తన టెస్టు కెరీర్ ను ఆరంభించింది ఇక్కడే. 1993లో లారా.. సిడ్నీ టెస్టులో ఎంట్రీ  ఇచ్చి  277 పరుగులతో సంచలనం సృష్టించాడు. దీనికి 30 ఏండ్లు నిండటంతో.. సచిన్, లారాలను ఒకేరోజున గౌరవించింది ఎస్‌సీజీ. తనను ఎస్‌సీజీ గౌరవించడంపై లారా స్పందిస్తూ.. 'ఎస్‌సీజీ మేనేజ్‌మెంట్‌ నన్ను గుర్తించినందుకు గౌరవంగా ఉంది. సచిన్‌ సైతం  ఇలాగే భావిస్తాడు. ఇక్కడ నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో మంచి  జ్ఞాపకాలున్నాయి. ఆస్ట్రేలియాలో ఎప్పుడు పర్యటించినా సిడ్నీలో ఆడటాన్ని ఆస్వాదించేవాడిని’అని తెలిపాడు.

 

కాగా సిడ్నీలో  లారా  4 టెస్టులు ఆడి  384 పరుగులు చేశాడు.  అత్యధిక స్కోరు 277. ఈ గ్రౌండ్ లో ఇదే హయ్యస్ట్ స్కోరు. సచిన్  సిడ్నీలో  ఐదు టెస్టులాడి 788 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండటం విశేషం. సిడ్నీలో సచిన్ సగటు ఏకంగా 157 గా ఉంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios