Asianet News TeluguAsianet News Telugu

టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022గా సూర్య భాయ్... ఎంట్రీ ఇచ్చిన తర్వాతి ఏడాది ఐసీసీ అవార్డు...

ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్ యాదవ్... ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్ 2022గా ఆస్ట్రేలియా బ్యాటర్ తహిళా మెక్‌గ్రాత్....

Suryakumar Yadav won the ICC Men's T20 cricketer of 2022 CRA
Author
First Published Jan 25, 2023, 4:17 PM IST

సూర్య భాయ్... అది పేరు కాదు. టీ20 క్రికెట్ ప్రపంచంలో అదే బ్రాండ్. ఐపీఎల్‌లో వరుస సీజన్లలో అదరగొడుతున్న సెలక్టర్లు పట్టించుకోని ఈ ప్లేయర్, అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడంతోనే రికార్డులు తిరగరాస్తున్నాడు. 2021లో ఎంట్రీ ఇచ్చిన సూర్య, 2022 ఏడాదికి గాను టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు...

ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. దాదాపు 60 సగటుతో 189.68 స్ట్రైయిక్ రేటుతో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు...

టీ20ల్లో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో దూసుకుపోతున్న సూర్యకుమార్ యాదవ్, ఆరంగ్రేటం చేసిన రెండో ఏడాదిలోనే ఐసీసీ అవార్డు సొంతం చేసుకున్నాడు. 

గత ఏడాది 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 46.56 సగటుతో 1164 పరుగులు చేశాడు. సూర్య భాయ్ స్ట్రైయిక్ రేటు 187.43గా ఉంది. టీమిండియా నుంచి ఐసీసీ టీ20 మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మూడు సార్లు, మహేంద్ర సింగ్ ధోనీ 2 సార్లు, రోహిత్ శర్మ ఓ సారి ఐసీసీ అవార్డులు గెలిచారు.

టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ అవార్డులు దక్కించుకున్నారు. 2010లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్న సచిన్ టెండూల్కర్, ఏ ఫార్మాట్‌లోనూ ఐసీసీ అవార్డు దక్కించుకోకపోవడం విశేషం. 

ఆస్ట్రేలియా బ్యాటర్ తహిళా మెక్‌గ్రాత్, ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపికైంది. తహిళా మెక్‌గ్రాత్ గత ఏడాది 16 టీ20 మ్యాచులు ఆడి 435 పరుగులు చేయడమే కాకుండా 13 వికెట్లు తీసింది...

నమీబియా ఆటగాడు గెర్హాడ్ ఎరాస్మస్, ఐసీసీ మెన్స్ అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపికయ్యాడు. గత ఏడాది వన్డేల్లో 956 పరుగులు చేసిన గెర్హాడ్ ఎరాస్మస్, టీ20ల్లో 306 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు కూడా పడగొట్టాడు...

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్లేయర్ ఇషా ఓజా, ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022 టైటిల్ దక్కించుకుంది. గత ఏడాది టీ20ల్లో 675 పరుగులు చేసిన ఇషా ఓజా, రెండు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించింది. బౌలింగ్‌లో 4.84 ఎకానమీతో 15 వికెట్లు కూడా తీసింది.. 

Follow Us:
Download App:
  • android
  • ios