Suryakumar Yadav: సూర్య 'ప్రతాపం'.. ఒక్క సెంచరీతో ఎన్నో రికార్డులు బ్రేక్ 

Suryakumar Yadav :దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ వన్ మ్యాన్ షో చేశాడు. తన 360 డిగ్రీస్ ఆటతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.మరోసారి మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారో నిరూపించాడు.  అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఎన్నో రిక్డారులను తన పేరిట నమోదు చేసుకున్నారు.ఇంతకీ ఆ రికార్డులు ఏంటి? 

Suryakumar Yadav joins Rohit, Maxwell in special club with record-equalling century KRJ

Suryakumar Yadav:  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో  టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌తో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి కేవలం 56 బంతుల్లో 100 పరుగులు చేశారు. ఈ తరుణంలో సూర్య మైదానం చుట్టూ భారీ షాట్లు కొట్టి, తనను మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. ఇదే సమయంలో మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఎన్నో రిక్డారులను తన పేరిట నమోదు చేసుకున్నారు.ఇంతకీ ఆ రికార్డులు ఏంటి? 

జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా శుభారంభం చేసింది. ఈ తరుణంలో బ్యాటింగ్ చేసిన సూర్య విధ్వంసం స్రుష్టించారు.  కేవలం 56 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో అద్భుత సెంచరీ సాధించింది. ఇది కాకుండా యశస్వి జైస్వాల్ కూడా 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన నాలుగో టీ 20 ఇంటర్నేషనల్ సెంచరీతో సూర్య ఎన్నో రికార్డులను బ్రేక్ చేశారు.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు పూర్తి 

ఇప్పటివరకు.. సూర్యకుమార్ యాదవ్‌తో సహా ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే టీ20 ఇంటర్నేషనల్‌లో నాలుగుసార్లు సెంచరీలు సాధించగలిగారు. ఇందులో రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్ పేర్లు ఉన్నాయి. రోహిత్ తన 140వ టీ20 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు నమోదు చేయగా, గ్లెన్ మాక్స్‌వెల్ తన 92వ ఇన్నింగ్స్‌లో నాలుగో టీ20 ఇంటర్నేషనల్ సెంచరీని పూర్తి చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ మైలురాయిని చేరుకోవడానికి కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇది కాకుండా..ప్రపంచ క్రికెట్‌లో నాలుగు T20 అంతర్జాతీయ సెంచరీలను  వివిధ దేశాలతో పూర్తి చేసిన బ్యాట్స్ మెన్స్ గా  సూర్యకుమార్ యాదవ్ మొదటి వ్యక్తిగా నిలిచాడు.  

ఈ విషయంలో రోహిత్ తర్వాత రెండో భారత కెప్టెన్.

ఇప్పటి వరకు భారత్ తరఫున టీ20లో కెప్టెన్‌గా సెంచరీ సాధించిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండగా.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ జాబితాలో చేరాడు. కెప్టెన్‌గా రోహిత్ 2 సెంచరీలు చేయగా, సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కెప్టెన్‌గా తన పేరుకు సెంచరీని జోడించాడు. ఇది కాకుండా టీ20 ఇంటర్నేషనల్ నాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ పేరిట నమోదైంది.

కోహ్లీ రికార్డు బ్రేక్

ఇదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా సూర్య రెండో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి 117 సిక్సర్లు కొట్టాడు. టీ20లో మొత్తం 182 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్నాడు.
 
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్:

రోహిత్ శర్మ- 182 సిక్సర్లు
సూర్యకుమార్ యాదవ్ - 123 సిక్సర్లు*
విరాట్ కోహ్లీ- 117 సిక్సర్లు
కేఎల్ రాహుల్ - 99 సిక్సర్లు
యువరాజ్ సింగ్- 74 సిక్సర్లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios