టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న యంగ్ క్రికెటర్లు అందరూ సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ 2021 కోసం సిద్ధమవుతున్నారు. టీమ్ డీతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. టీమ్ ఏతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 59 పరుగులు చేసిన నాటైట్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్... నేడు ఏకంగా అజేయ సెంచరీ చేశాడు. 

ఎమ్‌సీఏ ప్రాక్టీస్ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ వేసిన ఓ ఓవర్‌లో ఓ సిక్సర్, మూడు ఫోర్లతో 21 పరుగులు రాబట్టాడు సూర్యకుమార్ యాదవ్.

మొదటి మూడు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, నాలుగు ఓవర్లు ముగిసేసరికి సూర్యకుమార్ యాదవ్ హిట్టింగ్ కారణంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.