టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా మరోమారు తండ్రి అయ్యాడు. రైనా, ప్రియాంకలకు ఈరోజు తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రైనా ఓ ట్వీట్ చేశాడు. తమ కొడుకు, గ్రేసియాకు సోదరుడు రియో రైనాను స్వాగతిస్తున్నందుకు తాము గర్విస్తున్నామని అన్నాడు. 

Also Read బుజ్జి క్రికెటర్... కుమార్తె సమైరాతో రోహిత్ శర్మ క్రికెట్..

ఆ చిన్నారి బౌండరీల పరిధులు దాటి ఎదగాలని ఆకాంక్షించాడు.  కాగా, రైనా దంపతులకు ఇప్పటికే నాలుగు సంవత్సరాల పాప గ్రేసియా రైనా ఉంది. ఇప్పుడు అబ్బాయి కూడా పుట్టడంతో రైనా దంపతుల ఆనందానికి అవధులు లేవు. కాగా... కొడుకు పుట్టినందుకు సురేష్ రైనా కి తోటి క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.