టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నిమిషాల్లో భారత క్రికెట్ అభిమానులకు మరో షాక్ తగిలింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ , ధోని సన్నిహితుడు సురేశ్ రైనా సైతం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జూలై 2005లో శ్రీలంకపై తొలి వన్డే మ్యాచ్ ఆడిన సురేశ్ రైనా.. అదే లంకపై 2010లో జూలైలో టెస్టు ఆడాడు. కెరీర్‌లో 78 టీ20లు, 226 వన్డేలు, 19 టస్టులు ఆడాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో ఒకటి, టీ20ల్లో ఒక సెంచరీని కొట్టాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశాడు రైనా.

‘‘ మహీ భాయ్.. నీ బాటలోనే నేనంటూ ’’ ప్రకటించాడు. టీమిండియాలో ధోనీ, రైనా మంచి మిత్రులు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడంటే ఆ జట్టులో రైనా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఐపీఎల్‌లోనూ ఇద్దరు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

Scroll to load tweet…