సురేష్ రైనాకు క్షవరం చేసిన భార్య ప్రియాంక: ట్విట్టర్ లో ఫొటో
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు అవుతున్న ప్రస్తుత తరుణంలో క్రికెటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని వారు తగిన విధంగా వాడుకుంటున్నారు. సురేష్ రైనాకు ఆయన భార్య క్షవరం చేసింది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ భూతంతో ప్రపంచం స్తంభించిపోయిన నేపథ్యంలో పలు దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ స్థితిలో క్రీడాకారులు కూడా తమ ఇళ్లలో సమయాన్ని తగిన విధంగా సార్థకం చేసుకుంటున్నారు.
క్రికెటర్ సురేష్ రైనాకు ఆయన భార్య ప్రియాంక క్షవరం చేసింది. ఆ ఫోటోను రైనా ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దానికి ఓ కామెంట్ కూడా జత చేశాడు. ఎంతో కాలం తాను నిరీక్షించలేనని అంటూ హెయిర్ కట్ చేసిన ప్రియాంకకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు.
తన భార్య అనుష్క శర్మ తనకు హెయిర్ కట్ చేస్తున్న వీడియోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు విరాట్ కోహ్లీని అనుష్క డిన్నర్ రావాలంటూ పిలిచిన విషయం తెలిసిందే.
క్రీడాకారులు తమ అభిమానులతో సోషల్ మీడియాతో సంబంధాలు సాగిస్తూనే ఉన్నారు. అదే సమయంలో కరోనా వైరస్ కట్టడికి అనుసరించాల్సిన విధానాలను కూడా వివరిస్తున్నారు.