Asianet News TeluguAsianet News Telugu

సన్ రైజర్స్ సరికొత్త రికార్డు... ఐపిఎల్ చరిత్రలోనే మొదటిసారి

ఐపిఎల్ సీజన్ 12 లో చివరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్ కు చేరుకునే నాలుగో జట్టుపై సస్పెన్స్ కొనసాగింది. అయితే చివరకు ముంబై చేతిలో కోల్ కతా ఓడిపోవడంతో తన సన్ రైజర్స్ హైదరాబాద్ కు కలిసొచ్చింది. హైదరాబాద్, కోల్ కతా,  పంజాబ్ లు మూడు ఆరు విజయాలతో  12  పాయింట్లను సాధించి సమాన స్థాయిలో నిలిచాయి. అయితే నెట్  రన్ రేట్ సన్ రైజర్స్ కే అధికంగా వుండటంతో ప్లేఆఫ్ అవకాశాన్ని ఆ జట్టు తన్నుకుపోయింది. 

sunrisers hyderabad new record
Author
Hyderabad, First Published May 6, 2019, 7:38 PM IST

ఐపిఎల్ సీజన్ 12 లో చివరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్ కు చేరుకునే నాలుగో జట్టుపై సస్పెన్స్ కొనసాగింది. అయితే చివరకు ముంబై చేతిలో కోల్ కతా ఓడిపోవడంతో తన సన్ రైజర్స్ హైదరాబాద్ కు కలిసొచ్చింది. హైదరాబాద్, కోల్ కతా,  పంజాబ్ లు మూడు ఆరు విజయాలతో  12  పాయింట్లను సాధించి సమాన స్థాయిలో నిలిచాయి. అయితే నెట్  రన్ రేట్ సన్ రైజర్స్ కే అధికంగా వుండటంతో ప్లేఆఫ్ అవకాశాన్ని ఆ జట్టు తన్నుకుపోయింది. 

ఇలా అదృష్టం  కలిసొచ్చి ప్లేఆఫ్ అవకాశాన్ని కొట్టేసిన సన్ రైజర్స్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఐపిఎల్ ప్రారంభం నుండి  ఇప్పటివరకు ఇలా కేవలం 12 పాయింట్లతో ప్లేఆఫ్ అవకాశాన్ని దక్కించుకున్న ఏకైక జట్టుగా హైదరాబాద్ జట్టు నిలిచింది. ఐపిఎల్ లో ఇప్పటివరకు అతి తక్కువ పాయింట్లతో ప్లేఆఫ్ కు  చేరిన రికార్డు రాజస్థాన్ పేరిట వుంది. గతేడాది ఈ జట్టు 14 పాయింట్లతో ప్లేఆఫ్ కు అర్హత సాధించింది. తాజాగా సన్ రైజర్స్ ఆ రికార్డును బద్దలుగొట్టింది. 

కోల్‌కతా నైట్ రైడర్స్ పై గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మొదటిసారి పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ ను ఆక్రమించింది. మొదటినుండి టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న చెన్నై, డిల్లీలను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అంతేకాకుండా కోల్  కతా,పంజాబ్ ప్లేఆఫ్  అవకాశాలను కూడా దూరంచేసి తాను గెలిచి సన్ రైజర్స్ ని కూడా గెలిపించింది. దీంతో  హైదరాబాద్ అభిమానులు సన్ రైజర్స్ పైప సెటైర్లు వేస్తూ ముంబై  ఇండియన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

మొత్తానికి ఈ సీజన్లో అన్ని జట్లు భవితవ్యాన్ని నెట్ రన్ రేట్లే  నిర్ణయించాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచి  జట్ల మధ్య కూడా తేడా నెట్ రన్ రేటే కావడం విశేషం. ముంబై, చెన్నై, డిల్లీలు మొత్తంగా 9 విజయాలతో  18 పాయింట్లు సాధించిన సమ స్థాయిలో నిలిచాయి. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా (+0.421) వుండటంతో ముంబై  మొదటి, చెన్నై (+0.131) రెండో, దిల్లీ (+0.044) మూడో స్థానంలో నిలిచాయి. అదేవిధంగా సన్ రైజర్స్ (+0.577) తో ఏకంగా ప్లేఆఫ్ అవకాశాన్నే కొట్టేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios