రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఓటమిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ స్పందించాడు. కీలక సమయంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఓటమిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ స్పందించాడు. కీలక సమయంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్ధి ముందు చెప్పుకోదగ్గ లక్ష్యం నిర్దేశించామని.. అయితే ఈ మ్యాచ్‌లో మరో 15 పరుగులు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

బెంగళూరు బ్యాట్స్‌మెన్ కూడా బాగా ఆడారని... మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో చివరి వరకు పోరాడి ఓడామని విలియమ్సన్ తెలిపాడు.

టీ20 క్రికెట్ ఇలాగే ఉంటుందని.. క్షణాల్లో ఫలితాలు తారుమారు అవుతూ ఉంటాయని.. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందేనని విలియమ్సన్ వివరించాడు.

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టంగా ఉన్నాయి. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ రోజు రాత్రి జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా ఓడిపోవాలి.