Asianet News TeluguAsianet News Telugu

Betway SA20 ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. వ‌రుస‌గా రెండో టైటిల్

Betway SA20 - DSG vs SEC: సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో సన్‌రైజర్స్ వ‌రుస‌గా రెండో సారి టైటిల్ సాధించింది. ఫైన‌ల్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ పై 89 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ గెలిచింది. 
 

Sunrisers Eastern Cape win over Durban Super Giants, Sunrisers become Betway SA20 champions RMA
Author
First Published Feb 11, 2024, 2:41 PM IST | Last Updated Feb 11, 2024, 2:41 PM IST

Betway SA20 - DSG vs SEC: సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దక్షిణాఫ్రికా లీగ్ SA20లో వరుసగా రెండో టైటిల్‌ను గెలుచుకుంది. ఆ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్‌ను ఓడించింది. లీగ్ తొలి సీజన్‌లోనూ ఛాంపియన్‌గా నిలిచిన స‌న్ రైజ‌ర్స్ఈ ఏడాది కూడా టైటిల్ ను సాధించి చ‌రిత్ర సృష్టించింది.

కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 204 ప‌రుగులు చేసింది. స‌న్ రైజ‌ర్స్ ఆట‌గాళ్ల‌లో జోర్డాన్ హెర్మాన్ 42, అబెల్ 55, ఐడెన్ మార్క్రామ్ 42, ట్రిస్టన్ స్టబ్స్ 56 పరుగులతో రాణించారు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు.

205 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ 17 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. వియాన్ ముల్డర్ 38 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మార్కో జాన్సెన్ 5, డేనియల్ వోరల్ 2, ఒట్నీల్ బార్ట్‌మాన్ 2 వికెట్లు తీసుకుని డర్బన్ సూపర్ జెయింట్స్ ఓటమిని శాసించారు. టామ్ అబెల్ (55 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా హెన్రిచ్ క్లాసెన్ ఎంపికయ్యాడు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios