ఐపీఎల్ 13వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న జరిగే మొదటి మ్యాచులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడబోతున్నాయి. ఈసారి టైటిల్ గెలిచే హాట్ ఫెవరెట్ జట్టు ఏదంటే మళ్లీ ముంబైయే అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

‘ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐపీఎల్‌లో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో రోహిత్‌కి బాగా తెలుసు. అందుకే ఈసారి కూడా ముంబై ఇండియన్స్‌ జట్టే టైటిల్ గెలుస్తుందేమో’నని అన్నారు సునీల్ గవాస్కర్.

ముంబై జట్టులో మంచి ప్లేయర్లు కూడా ఉన్నాయని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డి కాక్, హార్ధిక్ పాండ్యా, బుమ్రా, కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా... వంటి ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ జట్టు పటిష్టంగా ఉందని చెప్పుకొచ్చారు సునీల్ గవాస్కర్.