ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ 12 లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గా కంటే రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ వివాదంలో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కొద్దిరోజుల క్రితం జైపూర్ వేధికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య రాజస్థాన్ జట్టు బ్యాట్ మెన్ జోస్ బట్లర్ ను పంజాబ్ కెప్టెన్ కమ్ బౌలర్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. కీలక సమయంలో అశ్విన్ ఇలా మన్కడింగ్ కు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ మన్కడింగ్ వివాదంపై క్రికెట్ వర్గాల్లో ఇప్పటికీ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అశ్విన్ బౌలింగ్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. 

ఎక్కడ క్రీజు దాటితే అశ్విన్ మన్కడింగ్ కు పాల్పడి ఔట్ చేస్తాడేమోనన్న భయం వార్నర్ ఆటలో కనిపించింది. అందుకే అతడు బౌలింగ్ చేస్తున్నంతసేపు నాన్ స్ట్రైక్ ఎండ్ లో వున్న వార్నర్ బాల్ అశ్విన్ చేతిలోంచి వెళ్లే వరకు క్రీజును వదల్లేదు. అయితే అప్పుడప్పుడు కాస్త అదమరుపుగా బాల్ వేయకముందే క్రీజును దాటినా బ్యాట్ మాత్రం క్రీజులోనే వుండేలా చూసుకున్నాడు.  ఇలా అశ్విన్ బౌలింగ్ చేస్తున్నంతసేపు వార్నర్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన వీడియయో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూ క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

ఇలా మన్కడింగ్ కు పాల్పడటం క్రీడా స్పూర్తికి విరుద్దమైనా క్రికెట్ నిబంధనల ప్రకారం సరైనదేనని క్రికెట్ నిబంధనలను రూపొందించే ఎంసిసి తెలిపింది. నాన్ స్ట్రైక్ ఎండ్ లోని బ్యాట్ మెన్  బౌలర్ బంతి వూయకముందే క్రీజులోంచి బయలకు వెళ్లకూడదు. బ్యాట్ మెన్ అలా చేస్తున్నపుడు బౌలర్ సదరు ఆటగాన్ని మొదట హెచ్చరించాలి. ఆ తర్వాత పదేపదే అలా చేస్తే మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడంలో తప్పులేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. కానీ అశ్విన్ అలాంటి హెచ్చరికలు లేకుండానే బట్లర్ ను ఔట్ చేయడం వల్లే వివాదం చేలరేగిందని వారు అభిప్రాయపడుతున్నారు. 

వీడియో