Asianet News TeluguAsianet News Telugu

ప్లేఆఫ్ అవకాశంపై సన్ రైజర్స్ ట్వీట్... అభిమానుల సెటైర్లు

ఐపిఎల్ సీజన్ 12లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ప్లేఆఫ్ కు చేరింది. ఈ జట్టు తన ఆటతీరులో కంటే అదృష్టం కలిసిరావడంతోనే ప్లేఆఫ్ కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ పుణ్యమా అని సన్ రైజర్స్ ప్లేఆఫ్ కల ఫలించింది. దీంతో హైదరాబాద్ అభిమానులు సన్ రైజర్స్ కంటే ముంబై జట్టునే ఎక్కువగా పొగుడుతూ కృతజ్ఞతలు చెబుతున్నారు. అంతే కాదు సన్ రైజర్స్ పై తమదైన  రీతిలో సెటైర్లు విసురుతున్నారు. 
 

sun risers hyderabad fans satires
Author
Hyderabad, First Published May 6, 2019, 5:23 PM IST

ఐపిఎల్ సీజన్ 12లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ప్లేఆఫ్ కు చేరింది. ఈ జట్టు తన ఆటతీరులో కంటే అదృష్టం కలిసిరావడంతోనే ప్లేఆఫ్ కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ పుణ్యమా అని సన్ రైజర్స్ ప్లేఆఫ్ కల ఫలించింది. దీంతో హైదరాబాద్ అభిమానులు సన్ రైజర్స్ కంటే ముంబై జట్టునే ఎక్కువగా పొగుడుతూ కృతజ్ఞతలు చెబుతున్నారు. అంతే కాదు సన్ రైజర్స్ పై తమదైన  రీతిలో సెటైర్లు విసురుతున్నారు. 

ఆదివారం రాత్రి వాంఖడే  స్టేడియంలో రోహిత్ సేన  కోల్ కతా తో తలపడి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో ముంబై ప్రత్యక్షంగా కోల్ కతా ను ఓడించడమే కాదు మొత్తం ఐపిఎల్ టోర్నీనే ప్రభావితం చేసిందని  చెప్పాలి. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా ముంబై చెన్నై, డిల్లీలను వెనక్కి నెట్టి పాయింట్స్ టేబుల్ లో టాప్ కు చేరుకుంది. అలాగే కోల్ కతా ప్లేఆఫ్ ఆశలను చిదిమేస్తూ సన్ రైజర్స్ కు పరోక్షంగా సహకరించింది. ఇలా తమ జట్టును ప్లేఆఫ్ కు చేర్చిన ముంబై ఇండియన్స్ ను ప్రశంసలతో ముంచెత్తుతూనే సన్ రైజర్స్ పై హైదరాబాదీలు తమదైన స్టైల్లో సెటైర్లు విసురుతున్నారు. 

వాంఖడేలో ముంబై-కోల్‌కతా మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించింది. తాము ప్లేఆఫ్ కు చేరుకున్నట్లు పేర్కొంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్  పై క్రికెట్ ప్రియులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సన్ రైజర్స్ ప్లేఆఫ్ కు చేరుకోలేదని...ముంబై  చేర్చిందంటూ కాస్త సెటైరిక్ గా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

కోల్ కతాపై జరిగిన  మ్యాచ్ లో బౌలర్ లసిత్ మలింగ్ కేవలం ముంబైనే కాదు సన్ రైజర్స్ ను కూడా గెలిపించాడని కామెంట్ చేస్తున్నారు.  అతడు ఒకే మ్యాచ్ ద్వారా రెండు  జట్ల తరపున ఆడినట్లు అనిపించిందని అభిప్రాయపడుతున్నారు. అలాగే బ్యాటింగ్ అదరగొట్టిన రోహిత్ కు హైదరాబాద్ అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా వున్న ఫోటోలతో మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా వివిధ  రకాలుగా సన్ రైజర్స్ పై సెటైర్లు వేస్తూ ముంబై జట్టుని ఆకాశానికెత్తుతున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios