Asianet News TeluguAsianet News Telugu

లిఫ్టులో ఇరుక్కున్న స్టీవ్ స్మిత్... గంటసేపు సాగిన ఆపరేషన్ లిఫ్ట్‌‌ను సోషల్ మీడియాలో...

The Ashes Series 2021-22: మెల్‌బోర్న్ హోటల్‌లో లిఫ్టులో ఇరుక్కుపోయిన స్టీవ్ స్మిత్... గంట సేపు లిఫ్ట్‌లో ఆపసోపాలు పడిన ఆసీస్ టెస్టు వైస్ కెప్టెన్...

Steve Smith Shares Operation Lift Story after struck in a Hotel Lift, Marnus Labuschagne
Author
India, First Published Dec 31, 2021, 3:04 PM IST

‌ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్, టెస్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ లిఫ్టులో ఇరుక్కుపోయాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో హోటల్‌లో బస చేస్తోంది. మెల్‌బోర్న్‌లో తన రూమ్‌కి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు స్టీవ్ స్మిత్...

అయితే స్మిత్ ఎక్కిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ‘జూనియర్ స్మిత్’ మార్నస్ లబుషేన్... లిఫ్ట్ బయట నుంచి తెరవడానికి శతవిధాలా ప్రయత్నించాడు. అయితే ఎంతకీ లిఫ్ట్ డోరు తెరుచుకోకపోవడంతో బయటి నుంచే స్టీవ్ స్మిత్ తినడానికి కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు లబుషేన్...

దాదాపు 50 నిమిషాలకు పైగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన స్టీవ్ స్మిత్, తనకు జరిగిన ఈ వింత అనుభవాన్నంతటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో తీసి పోస్టు చేశాడు. ఆ 50 నిమిషాల పాటు ఏం చేయాలో తెలియక ఇన్‌స్టాగ్రామ్‌లో వింత వింత వేషాలెన్నో వేశాడు స్టీవ్ స్మిత్...

‘నేను నా ఫ్లోర్‌కి వచ్చేశా, కానీ లిఫ్ట్ డోర్లు తెరుచుకోలేదు... దీని సర్వీస్ అయిపోయినట్టుంది. డోర్ తెరవడానికి ఎంతగా ప్రయత్నించినా వీలు కాలేదు. అటు వైపు నుంచి మార్నస్ లబుషేన్ కూడా లిఫ్ట్ తెరవడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అతని ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు...

ఈ సాయంత్రం బాగా ఎంజాయ్ చేయాలని అనుకున్నా, కానీ నా ప్లాన్స్ అన్నీ లిఫ్టులో ముగిసిపోయేలా ఉన్నాయి. నేను బాగా అలసిపోయాను. ఇక ఇక్కడే కూర్చుంటా. లిఫ్టులో ఇరుక్కున్నప్పుడు ఇంతకన్నా ఏం చేయగలం...  ఏం చేయాలో కాస్త చెప్పండి...’ అంటూ అభిమానులను కోరాడు స్టీవ్ స్మిత్...

చాలామంది నెటిజన్లు, డేవిడ్ వార్నర్‌లా ఫన్నీ వీడియోలు చేయాలని సలహాలు ఇవ్వడంతో తన స్టైల్‌లో ఓ స్ఫూఫ్ వీడియో కూడా పోస్టు చేశాడు స్టీవ్ స్మిత్... 55 నిమిషాల తర్వాత లిఫ్ట్ నుంచి బయటపడిన స్టీవ్ స్మిత్... తనని బయటికి తీసుకొచ్చిన సిబ్బందికి ధన్యవాదాలు చెబుతూ, రూమ్‌కి వెళ్లిపోయాడు..

యాషెస్ సిరీస్‌ 2021-22లో భాగంగా మూడు టెస్టుల్లో గెలిచి, సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్టు జనవరి 5 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత హోబర్ట్ వేదిగా జనవరి 14 నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

సాండ్ పేపర్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీ కోల్పోయిన స్టీవ్ స్మిత్, టిమ్ పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు తీసుకున్నాడు. నయా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కరోనా నిబంధనల కారణంగా రెండో టెస్టుకి దూరంగా ఉండడంతో ఆ మ్యాచ్‌కి తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు స్టీవ్ స్మిత్... 

Follow Us:
Download App:
  • android
  • ios