Asianet News TeluguAsianet News Telugu

రికార్డులలో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి.. వాల్తేరు విరాట్ ఇక్కడ.. పూనకాలు లోడింగ్..

Virat Kohli: ‘రికార్డులలో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి.. విరాట్, వాల్తేర్ విరాట్’ అంటున్నాడు కోహ్లీ. ఇదేం ఇన్‌స్టాగ్రామ్ రీల్ కాదండోయ్...!  

Star Sports Telugu Channel Status Poses  Megastar  Chiranjeevi as Virat Kohli, Tweet Went Viral
Author
First Published Jan 9, 2023, 5:44 PM IST

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య థియేటర్స్ లో సందడి చేయనుంది.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్నే వైజాగ్ లో జరిగింది.  ఈ ఈవెంట్ కు ముందే చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చిరంజీవి మార్కు డైలాగులు  ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వింటేజ్ చిరంజీవిని  తిరిగి చూడొచ్చని   సినిమా డైరెక్టర్ బాబీ అంటున్నాడు.  ఇక డైలాగుల విషయానికొస్తే.. ట్రైలర్లో ‘రికార్డులలో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి..’ అని  మెగాస్టార్ చెప్పడం  ఆయన అభిమానులను అలరించింది. 

ఇప్పుడు ఇదే డైలాగ్ ను విరాట్ కోహ్లీ తనదైన స్టైల్ లో చెబుతున్నాడు.  ‘రికార్డులలో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి.. విరాట్, వాల్తేర్ విరాట్’ అంటున్నాడు.  అదేంటి కోహ్లీ  మెగాస్టార్  కొత్త సినిమా ట్రైలర్ చూసి ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్ చేశాడని అనుకుంటున్నారా..?  

అలాంటిదేమీ లేదు. ఇదంతా  ఇండియా-శ్రీలంక వన్డే సిరీస్ కోసం  బీసీసీఐ అధికారిక ప్రసారదారు అయిన స్టార్ స్పోర్ట్స్ చేస్తున్న మాయ.  స్టార్ స్పోర్ట్స్ తెలుగు  ఛానెల్ లో కూడా  మ్యాచ్ లు ప్రసారం కానున్న నేపథ్యంలో  ఆ ఛానెల్ ట్విటర్ ఖాతాలో వాల్తేరు వీరయ్య  పోస్టర్ లో చిరంజీవిని తీసేసి అందులో కోహ్లీని అతికించేశారు.   ఫోటోతో పాటు  మెగాస్టార్ డైలాగ్ ను కూడా వాడుకున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

‘రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయి. కింగ్‌ కోహ్లీ బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌' అని చేసిన ట్వీట్ కోహ్లీ అభిమానులను ఆకట్టుకుంటున్నది.  ఈ ఫోటోలో చిరంజీవి  మాదిరిగానే కోహ్లీ కూడా   పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని అతడి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూనకాలు లోడింగ్ అని  వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇదిలాఉండగా భారత్ - శ్రీలంక మధ్య మంగళవారం తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే గువహతి (అసోం) చేరుకున్నాయి.  బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ తర్వాత  రోహిత్, కోహ్లీలు జట్టుతో చేరారు.   

లంకతో వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ 

లంకతో వన్డే సిరీస్ షెడ్యూల్.. 

మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఈనెల 10న గువహతిలో జరుగుతుంది. ఇప్పటికే ఇరు జట్లు ఇక్కడికి చేరుకున్నాయి.  మిస్ అయిన పలువురు ఆటగాళ్లు రేపటికల్లా జట్టుతో చేరతారు.   జనవరి 12న తిరువనంతపురంలో రెండో వన్డే జరగాల్సి ఉంది.  జనవరి 15న  కోల్కతాలో మూడో వన్డే జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios