Asianet News TeluguAsianet News Telugu

శర్మ అంటే రోహిత్ ఒక్కడేనా... వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కి ప్రోమోలో టీమిండియా కెప్టెన్‌కి...

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 ప్రోమోలో రోహిత్ శర్మను ట్రోల్ చేశారంటూ వాపోతున్న అభిమానులు... మహిళా క్రికెట్‌కి హైప్ తెచ్చేందుకు ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు.. 

Star Sports New promo for Womens T20 World cup gets controversy, Rohit Sharma fans CRA
Author
First Published Jan 24, 2023, 10:17 AM IST

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రోమోని విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమయ్యే మహిళా పొట్టి ప్రపంచ కప్ ప్రోమోలో రోహిత్ శర్మను ట్రోల్ చేశారంటూ వాపోతున్నారు అతని అభిమానులు.... దీనికి కారణం లేకపోలేదు!

ఈ యాడ్‌లో ఓ మహిళా క్రికెట్ అభిమాని, భారత జెర్సీలు అమ్మే షాపుకి వెళ్లి... ‘శర్మ వాలా జెర్సీ ఇవ్వండి...’ అని అడుగుతుంది. దానికి వెంటనే ఆ షాపు అతను, ‘రోహిత్ 45’ జెర్సీని ముందు పెడతాడు..

దానికి ఆ అభిమాని, ‘ఇది కాదు, వేరేది?’ అంటుంది. ‘మీకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలీదనుకుంటా?’ అని నవ్వుతాడు ఆ షాపతను. దానికామె... ‘మీకే ఎక్కువ తెలీదనుకుంటా.. ’ అని ఫోన్‌లో ‘దీప్తి శర్మ’ ఫోటో చూపించి...‘దీప్తి శర్మ... ఈమె కూడా టీమిండియాకి ఆడుతుంది’ అని సమాధానం ఇస్తుంది. దానికి అతను కాస్త ఇబ్బందిపడుతూ మహిళా క్రికెటర్ పేరున్న జెర్సీని తీసి ఇస్తాడు...

మహిళా క్రికెటర్లను కాస్త గుర్తించండి? అనే ఉద్దేశంతో రూపొందించిన ఈ జెర్సీ, వుమెన్స్ క్రికెట్ పరంగా చూస్తే బాగానే ఉన్నా... వాళ్లను పైకి లేపడానికి, పురుషుల క్రికెట్‌ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు కదా... అంటున్నారు నెటిజన్లు...

ఇప్పటికే ‘శర్మ గారి అబ్బాయి’ అని ఐపీఎల్ ప్రోమోల్లో రోహిత్ శర్మను తెగ మోసేశారు. అప్పుడు రాని ఇబ్బంది, మహిళా క్రికెట్ ప్రోమోలో ‘శర్మ అంటే రోహిత్ మాత్రమే కాదు...’ అని చెబితే వచ్చిందా? అని నిలదీస్తున్నారు మరికొందరు..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, ‘హిట్ మ్యాన్’గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, లేటు వయసులో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు..

అయితే టీమిండియా తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన ఆఖరి భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ కూడా శర్మనే అనే విషయాన్ని కాస్త గుర్తుంచుకోవాలని మరికొందరు వాపోతూ కామెంట్లు పెడుతున్నారు.  ఫిబ్రవరి 10న సౌతాఫ్రికా వుమెన్స్, శ్రీలంక వుమెన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది.

భారత జట్టు తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో ఆడనుంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్ ఆడే టీమిండియా మహిళా జట్టు, ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో మ్యాచులు ఆడుతుంది...

ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచులు నిర్వహించి, ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీకి ముగింపు పలకబోతోంది ఐసీసీ. 

Follow Us:
Download App:
  • android
  • ios