Bandula Warnapura: శ్రీలంక తొలి టెస్టు కెప్టెన్ మృతి.. టీ20 క్వాలిఫయింగ్ మ్యాచ్ కు ముందు భారీ షాక్

Bandula Warnapura Dies: టీ20 ప్రపంచకప్ లో నేడు క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడనున్న శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. శ్రీలంక క్రికెట్ చరిత్రలో తొలి టెస్టుకు సారథ్యం వహించిన బందుల వర్ణపుర మరణించారు. 

Srilanka s first test captain bandula warnapura dies at 68 SLC offered condolences

శ్రీలంక (Srilnaka)ఒక క్రికెట్ దిగ్గజాన్ని కోల్పోయింది. ఆ జట్టులో క్రికెట్ బీజాలు నాటిన నాటి తరం క్రికెటర్ బందుల వర్ణపుర (Bandula Warnapura) సోమవారం మరణించారు. కొలంబోలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. షుగర్, ఇతర వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వర్ణపుర (Warnapura Dies) వయసు 68 ఏండ్లు. 

గత కొన్నాళ్లుగా షుగర్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వర్ణపుర ఆరోగ్యం ఇటీవల కాలంలో బాగా క్షీణించింది. వర్ణపుర మరణంపై శ్రీలంక క్రికెట్ జట్టు (Srilnaka Cricket Team) శోకసంద్రంలో మునిగిపోయింది. నేటి సాయంత్రం ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup 2021) లో భాగంగా నమీబియా (Namibia) తో క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడనున్న ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలినట్లైంది. 

వర్ణపుర.. ఓపెనింగ్ బ్యాట్స్మెనే గాక కుడిచేతి వాటం మీడియం పేసర్ కూడా. 1982 లో ఇంగ్లండ్ తో శ్రీలంక ఆడిన తొలి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది వర్ణపురనే. అంతేగాక శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో తొలి బంతిని ఎదుర్కొన్న రికార్డుతో పాటు.. తొలి బంతి విసిరిన రికార్డు కూడా వర్ణపుర పేరిటే ఉంది. ఆ టెస్టులో రెండు ఇన్నింగ్స లలోనూ ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బౌలర్. 

 

 

1975-82 మధ్య కాలంలో లంకకు సారథ్యం వహించిన వర్ణపుర.. ఆ జట్టు తరఫున 4 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. అనంతరం ఆ జట్టు కోచ్ గా, కామెంటేటర్  గానూ సేవలందించాడు. కాగా.. 1982-83 లో శ్రీలంక క్రికెట్ బోర్డుతో విబేధించి సొంత జట్టుతో సౌత్ ఆఫ్రికా వెళ్లాలని భావించిన ఆయన.. జీవితకాలం నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కొంత కాలానికి జాతీయ జట్టు కోచ్ గా ఎంపికవడం విశేషం. 

 

 

కాగా, వర్ణపుర మరణంపై శ్రీలంక క్రికెట్ బోర్డు (Srilanka Cricket Board Chief) చీఫ్ షమి సిల్వ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తీరని లోటు అని, జాతీయ జట్టుకు వర్ణపుర అపారమైన సేవలందించాడని పేర్కొన్నారు.  లంక క్రికెట్ కు ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయని తెలిపారు. సిల్వతో పాటు పలువురు శ్రీలంక క్రికెటర్లు కూడా ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios