Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ క్రికెట్‌కు లంక దిగ్గజం మలింగ గుడ్‌బై.. కెప్టెన్సీ దక్కకపోవడమే కారణమా..?

శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టెస్ట్  , వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆయన.. తాజాగా టీ20 పోటీలకు సైతం శాశ్వతంగా సెలవు ప్రకటించాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు.

srilanka pace legend lasith malinga says good bye to all forms of cricket
Author
Colombo, First Published Sep 14, 2021, 7:06 PM IST

శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టెస్ట్  , వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆయన.. తాజాగా టీ20 పోటీలకు సైతం శాశ్వతంగా సెలవు ప్రకటించాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు మలింగ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు.

యార్కర్ల స్పెషలిస్ట్ గా పేరుగాంచిన మలింగ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఐదు హ్యాట్రిక్ లు నమోదు చేసిన ఒకే ఒక్క బౌలర్ మలింగానే. అంతేకాదు, వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు కూడా మలింగ పేరిటే నమోదై ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మలింగ ఇప్పటికీ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.

84 టీ20 మ్యాచ్ లు ఆడిన మలింగ 20.79 సగటుతో 107 వికెట్లు...  228 వన్డేల్లో 338 వికెట్లు , 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు, మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న మలింగ... ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా ఇప్పటికే తప్పుకున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో మలింగ ఐపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్ ల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్‌లో తన అసాధారణ బౌలింగ్‌తో ముంబయి ఇండియన్స్ కు మలింగ అనేక చిరస్మరణీయ విజయాలు అందించాడు.

లంక క్రికెట్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం... మలింగ అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు కెప్టెన్సీని ఆశించాడు. అయితే, సెలెక్టర్ల నుంచి సానుకూల స్పందన రాకపోవడం, లంక క్రికెట్ బోర్డు యువకులకు పెద్దపీట వేస్తుండడం వంటి కారణాలతో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు మలింగ.

Follow Us:
Download App:
  • android
  • ios