8 సార్లు ఛాంపియన్ కానీ.. భారత్‌ను ఫైనల్లో ఓడించిన శ్రీలంక
IND W vs SL W Asia Cup Final : మహిళల ఆసియా కప్ 2024 ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక భారత్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీని 8వ సారి గెలవాలన్న భారత్ కల చెదిరిపోయింది.
IND W vs SL W Asia Cup Final : భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక తొలి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట ఆతిథ్య జట్టు అద్భుతమైన బౌలింగ్ తో భారత్ ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది. టార్గెట్ ఛేదనలో బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి భారత్ ను శ్రీలంక దెబ్బకొట్టింది. ఈ ఓటమితో 8వ సారి ఆసియా కప్ గెలవాలన్న భారత్ కల చెదిరిపోయింది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక బ్యాట్స్‌మెన్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించారు. మొత్తంగా ఈ మ్యాచ్ లో శ్రీలంక నుండి ఆల్ రౌండ్ ప్రదర్శన కనిపించింది. దీంతో ఫలితం ఆ జట్టుకు అనుకూలంగా వచ్చింది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన చమరి అటపట్టు, హర్షిత సమరవిక్రమ శ్రీలంక టైటిల్ విజయానికి హీరోలుగా నిలిచారు.
166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. 43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసింది. ఆమె ఔటైన తర్వాత హర్షిత సమరవిక్రమ జట్టును విజయపథంలో నడిపించే బాధ్యతను స్వీకరించి అజేయంగా 69 పరుగులు చేసింది. కవిషా దిల్హరి 30 పరుగులు చేసి నాటౌట్ గా జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో భారత్ బౌలింగ్ ప్రభావం చూపలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు స్మృతి మంధాన (60) మినహా ఏ బ్యాటరు పెద్దగా పరుగులు అందివ్వలేకపోయారు. దీంతో పెద్ద స్కోర్ చేయడంలోనూ భారత్ విఫలమైంది.
రెండు జట్లలో ప్లేయింగ్-11
శ్రీలంక: విషమి గుణరత్నే, చమరి అటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), హాసిని పెరీరా, సుగంధికా కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రబోధిని, సచిని న్వీస్.
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా ఛెత్రి, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్.
MANU BHAKER : మను భాకర్ ఒలింపిక్ విజయ రహస్యం ఇదే..