Asianet News TeluguAsianet News Telugu

SRH vs RCB: మంచి స్కోరు చేసిన బెంగళూరు... దేవ్‌దత్, ఏబీడీ మెరుపులు...

ఆరంగ్రేట మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న దేవ్‌దత్ పడిక్కల్...

భారీ స్కోరు వెళ్లకుండా కట్టడి చేసిన హైదరాబాద్ బౌలర్లు...

SRH vs RCB: Royal challengers scored fight total against SunRisers Hyderabad CRA
Author
India, First Published Sep 21, 2020, 9:14 PM IST

IPL 2020: 13వ సీజన్‌ను పాజిటివ్ వైబ్రేషన్స్‌తో మొదలెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఒకానొక దశలో 190+ స్కోరు చేస్తుందనుకున్న ఆర్‌సీబీని, కరెక్టు టైమ్‌లో నియంత్రించి సాధారణ స్కోరుకే పరిమితం చేశారు హైదరాబాద్ బౌలర్లు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి, 163 పరుగులు చేసింది. యంగ్ సెన్సేషన్ దేవ్‌దత్ పడిక్కల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఆరంగ్రేట మ్యాచ్‌లోనే 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేశాడు దేవ్‌దత్ పడిక్కల్. ఓ వైపు దేవ్‌దత్ దూకుడుగా ఆడుతుంటే, ఆరోన్ ఫించ్ అతనికి సపోర్టుగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ మొదటి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

వెంటవెంటనే ఈ ఇద్దరూ అవుట్ కావడంతో కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ నెమ్మదిగా ఆడారు. దీంతో 11 నుంచి 15 ఓవర్ల మధ్య 25 పరుగులే వచ్చాయి. 13 బంతులాడి ఒక్క బౌండరీ లేకుండా 14 పరుగులు చేసిన కోహ్లీ, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గేర్ మార్చి బౌండరీలతో విరుచుకుపడ్డాడు ఏబీడీ.

19వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన డివిల్లియర్స్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో మూడో బంతికి రనౌట్ అయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios