Asianet News TeluguAsianet News Telugu

SRHvsMI: గెలిచి, ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ముంబైపై భారీ విజయం...

హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్న వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్...

మొదటి వికెట్‌కి 151 పరుగుల భారీ భాగస్వామ్యం...

డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

SRH vs MI: Sunrisers hyderabad reached play-offs after beating mumbai indians CRA
Author
India, First Published Nov 3, 2020, 10:59 PM IST

IPL 2020 సీజన్‌లో ప్లేఆఫ్ బెర్త్‌ను ఘనవిజయంతో కన్ఫార్మ్ చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్‌పై ఈజీ విక్టరీ సాధించింది సన్‌రైజర్స్. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా కలిసి మొదటి వికెట్‌కి 150+ పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, ముంబై బౌలర్లపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు.

మొదటి నుంచి దూకుడుగా ఆడిన డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. డేవిడ్ వార్నర్ 57 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్లతో 85 పరుగులు చేయగా, వృద్ధిమాన్ సాహా 45 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సుతో 58పరుగులు చేశాడు. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్ చేరింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ముంబైకి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడడం ఇదే తొలిసారి.

ఈ విజయంతో ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నవంబర్ 6న రాయల్ ఛాలెంజర్స్ హైదరాబాద్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో ఫైనల్ చేరేందుకు పోటీపడే అవకాశం దక్కుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios