Asianet News TeluguAsianet News Telugu

SRHvsMI: పోలార్డ్ సిక్సర్ల మోత... కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ముందు ఈజీ టార్గెట్...

సందీప్ శర్మకు మూడు వికెట్లు... 2 వికెట్లు తీసిన నదీమ్...

41 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్...

36 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... 33 పరుగులు చేసిన ఇషాన్ కిషన్...

 

SRH vs MI: Sunrisers Hyderabad bowlers attractive bowling controlling MI for average score CRA
Author
India, First Published Nov 3, 2020, 9:17 PM IST

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అదరగొట్టారు. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి, సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ ముందు ఓ మాదిరి టార్గెట్ ఉంచారు. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

మూడు మ్యాచుల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ 4 పరుగులకే అవుట్ కాగా డి కాక్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు.సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత కృనాల్ పాండ్యా డకౌట్ కాగా, సౌరబ్ తివారి 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. ఒక్క పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది ముంబై. 

ఈ దశలో ఇషాన్ కిషన్, పోలార్డ్ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. ఇషాన్ కిషన్ 30 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 33 పరుగులు చేయగా కల్టర్‌నైట్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. కిరన్ పోలార్డ్ 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు రాబట్టాడు.25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు పోలార్డ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ మూడు వికెట్లు తీయగా నదీమ్, జాసన్ హోల్టర్ రెండేసి వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios