Asianet News TeluguAsianet News Telugu

SRHvsKXIP: సన్‌రైజర్స్ ‘రికార్డు’ బాదుడు... బెయిర్ స్టో సెంచరీ మిస్...

వార్నర్ ‘రికార్డు’ హాఫ్ సెంచరీ...

97 పరుగులకి పెవిలియన్ చేరిన జానీ బెయిర్ స్టో... మొదటి వికెట్‌కి రికార్డు స్థాయిలో 160 పరుగులు... 

15 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

 

SRH vs KXIP: SunRisers Hyderabad scored big total against KXIP CRA
Author
India, First Published Oct 8, 2020, 9:27 PM IST

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. 15 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 160 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఓ దశలో ఈజీగా 220+ స్కోరు చేస్తుందనుకున్నా... వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో పరిమితమైంది.  

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా 15.1 ఓవర్లలో 160 పరుగులు జోడించారు.  

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డు స్థాయిలో ఐపీఎల్‌లో 50వ హాఫ్ సెంచరీ నమోదుచేయగా... బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ జోడి రెండో సారి 150+ పరుగుల భాగస్వామ్యం నమోదుచేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మొదటి వికెట్‌కి 160 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత 40 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన వార్నర్ అవుట్ అయ్యాడు. వార్నర్ అవుటైన మూడు బంతుల తర్వాత జానీ బెయిర్ స్టోను కూడా అవుట్ చేశాడు రవి బిష్ణోయ్. 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో... సెంచరీ మిస్ అయ్యాడు.

మనీశ్ పాండే 1 పరుగుకే అవుట్ కావడంతో 5 బంతుల్లో ఒక్క పరుగు తేడాతో 3 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 8 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కాగా ప్రియమ్ గార్గ్ డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 12 , కేన్ విలియంసన్ 20 పరుగులు చేశారు. రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా ఆర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios