SRHvsCSK: మంచి స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్... సన్‌రైజర్స్‌కి అదే టార్గెట్..
41 పరుగులు చేసిన అంబటి రాయుడు... 42 పరుగులు చేసిన షేన్ వాట్సన్... ధోనీ, జడేజా మెరుపులు
ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన సామ్ కుర్రాన్... సందీప్ శర్మకు 2 వికెట్లు...

IPL 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి టార్గెట్‌ను ఫిక్స్ చేసింది. సామ్ కుర్రాన్‌ను ఓపెనర్‌గా పంపి, ప్రయోగం చేసింది సీఎస్‌కే. కుర్రాన్ మంచి మెరుపు ఇన్నింగ్స్‌తో పర్వాలేదనిపించినా... మరో ఓపెనర్ డుప్లిసిస్ డకౌట్ అయ్యాడు.
సామ్ కుర్రాన్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి అవుట్ కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన షేన్ వాట్సన్, టూడౌన్‌లో వచ్చిన అంబటి రాయుడు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కి 81 పరుగులు జోడించిన తర్వాత అంబటి రాయుడు అవుట్ అయ్యాడు. అంబటి రాయుడు 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేయగా షేన్ వాట్సన్ 38 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు.
ధోనీ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 21 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 10 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 25 పరుగులు చేయగా బ్రావో డకౌట్ అయ్యాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 164/5 పరుగులు చేయగా ఇప్పుడు చెన్నై ఓ వికెట్ ఎక్కువ కోల్పోయి 3 పరుగులు ఎక్కువ చేసింది.