2018లోనే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్‌ శర్మకు అభిమానులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.  

టీమిండియా క్రికెటర్, సన్ రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ.. పెళ్లి పీటలు ఎక్కాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్‌ యాజమాన్యం సందీప్‌కు ట్విటర్‌ లో విషెస్ తెలియజేసింది. కొత్త దంపతుల ఫోటో షేర్ చేసి మరీ విష్ చేయడంతో.. అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. 

సందీప్‌.. అతని భార్య తాషా సాత్విక్‌ పెళ్లి ఫోటోను షేర్‌ చేస్తూ.. ''ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యామిలీకి పెళ్లి కళ వచ్చింది. కంగ్రాట్స్‌ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సందీప్‌ శర్మ.. మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్‌ చేసింది. కాగా తాషా సాత్విక్‌ వృత్తిరిత్యా ఫ్యాషన్‌,నగల డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్‌ శర్మకు అభిమానులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

Scroll to load tweet…

ఇక సందీప్‌ శర్మ 2013 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన సందీప్‌ శర్మ 110 వికెట్లు తీశాడు. 2013 నుంచి 2017 వరకు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు ఆడిన సందీప్‌ ఆ తర్వాత 2018 నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఇక జూలై 17, 2015లో జింబాబ్వేతో జరిగిన ట20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.