ఏడేళ్ల నిషేధం తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీతో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్, విజయ్ హాజారే ట్రోఫీలో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  9.4 ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రీశాంత్, 65 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ఫలితంగా యూపీ 49.4 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీకి అభిషేక్ గోస్వామి 54, ప్రియమ్ గార్గ్ 57, ఆకాశ్‌దీప్ నాథ్ 68, కరణ్ శర్మ 34 పరుగులతో రాణించి మంచి స్కోరు అందించారు.

284 పరుగుల లక్ష్యచేధనతో బరిలో దిగిన కేరళ, 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేయగా సంజూ శాంసన్ 29 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.