Asianet News TeluguAsianet News Telugu

‘అక్తరా తొక్కా.. ఉమ్రాన్ మాలిక్ కూడా దిగదుడుపే..’ ఫాస్టెస్ట్ బాల్ వేసిన భువీ..

Bhuvneshwar Kumar: ఇండియా-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత సీనియర్ పేసర్  ప్రపంచ రికార్డు స‌ృష్టించాడు. అక్తర్, ఉమ్రాన్ మాలిక్,  బ్రెట్ లీలను అధిగమించాడు. 

Speed Gun Shows Bhuvneshwar Kumar Bowls 201 KMPH Delivery During IND vs IRE 1st T20I, Twitter Reacts
Author
India, First Published Jun 27, 2022, 12:30 PM IST

టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు.  ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి గత రికార్డులను బద్దలుకొట్టాడు. ఇండియా-ఐర్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20లో భువీ.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన షోయభ్ అక్తర్, బ్రెట్ లీ, షాన్ టైట్, ఉమ్రాన్ మాలిక్ ల రికార్డులను ఒంటిచేత్తో బద్దలు కొట్టాడు. ఏకంగా గంటకు 201 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి కొత్త  చరిత్ర సృష్టించాడు. 

అదేంటి..? భువీ వేగం కంటే టెక్నిక్ తో బౌలింగ్ వేస్తాడు. మహా అయితే అతడి బౌలింగ్ స్పీడ్  135-140 స్పీడ్ దాటదు. అలాంటిది 201 ఎలా పడింది..? అనుకుంటున్నారు. మీకొచ్చిన అనుమానం సరైనదే. కానీ ఇక్కడ తప్పు భువీది కాదు.  

ఐర్లాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌలింగ్ చేసిన భువీ.. తొలిబంతిని  స్పీడ్ గన్ ఏకంగా 201 కిలోమీటర్ పర్ హవర్ గా చూపించింది. స్పీడ్ గన్ లో లోపం కారణంగా స్క్రీన్ పై భువీ బౌలింగ్ వేగం ఏకంగా 201 చూపించింది. ఇది చూసిన నెటిజన్లు  ఊరుకుంటారా..? అబ్బే అస్సలు ఛాన్సే లేదు. 

 

ట్విటర్ వేదికగా ఓ నెటిజన్ ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘చూడండి.. అసలు షోయభ్ అక్తర్, ఉమ్రాన్ మాలిక్ ఎవరు..? భువీని చూడండి. వరల్డ్ ఫాస్టెస్ట్ డెలివరీ వేశాడు. ఇది రియల్ పిక్..’ అని  వ్యంగ్యంగా  ట్వీట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ‘ఇది ప్రపంచ రికార్డు.. భువీ 201 కెఎంపీహెచ్ తో బౌలింగ్ చేశాడు. క్రికెచ్ చరిత్రలో ఇది ఫాస్టెస్ట్ బాల్. భువీ తన పేస్ తో అదరగొట్టాడు..’అని కామెంట్ చేశాడు. ఇక ఇదే మ్యాచ్ లో మరో చోట భువీ స్పీడ్ ఏకంగా 208 కెఎంపీహెచ్ గా చూపించడం గమనార్హం. 

కాగా ప్రపంచ  క్రికెట్ లో అత్యధిక వేగవంతమైన డెలివరీ విసిరింది  షోయభ్ అక్తర్. 2002లో అక్తర్.. న్యూజిలాండ్ తో జరిగిన  మ్యాచ్ లో ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని విసిరాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఇదే రికార్డు. ఆ తర్వాత షాన్ టైట్ (న్యూజిలాండ్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) లు 160 కి.మీ. వేగంతో బాల్స్ వేశారు. ఐపీఎల్-15లో భాగంగా భారత యువ  పేసర్ ఉమ్రాన్ మాలిక్ గంటకు 157 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి అక్తర్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios