ముంబై: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పింత్ వికెట్ కీపింగ్ లో మరింత మెరుగు పడాల్సిన అవసరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ లకు భారత జట్లను ఎంపిక చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు.

రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ లో మెరుగు పడాల్సిన అవసరం ఉందని, స్పెషలిస్టు వికెట్ కీపింగ్ కోచ్ పర్యవేక్షణలో అతడితో సాధన చేయిస్తామని ఎమ్మెస్కే అన్నారు. వెస్టిండీస్ వన్డే సిరీస్ లో బ్యాటింగ్ విషయంలో రిషబ్ పంత్ ఫరవా లేదనిపించాడు. కానీ వికెట్ కీపింగ్ లో చిన్న చిన్న తప్పిదాలు చేస్తున్నాడు. 

కాగా,త పంత్ ను అనవసరమైన ఒత్తిడిలోకి నెట్టకూడదని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా అన్నాడు. 22 ఏళ్ల పంత్ పై అనవసరమైన ఒత్తిడి ఉందని, తాను ఆ వయస్సులో ఉన్నప్పుడు ఆ విధమైన ఒత్తిడిని ఎదుర్కోలేదని, రిజర్వ్ బెంచ్ లో ఉన్న తాను సర్ వివ్ రిచర్జ్స్ కు సేవ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ కు సిద్ధపడ్డానని చెప్పాడు. పంత్ ను స్వేచ్ఛగా ఆడనివ్వాలని, డూ ఆర్ డై అనే పరిస్థితిని తీసుకుని రాకూడదని లారా అన్నాడు.