Asianet News TeluguAsianet News Telugu

‘ది హండ్రెడ్’ 2021 విజేతగా సదరన్ బ్రేవ్... ఓవల్ ఇన్‌విన్సిబుల్స్‌కి మహిళల టైటిల్...

పురుషుల ఫైనల్‌లో బర్మింగ్‌హమ్ ఫోనిక్స్‌తో జరిగిన ఫైనల్‌లో 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సదరన్ బ్రేవ్... మహిళల ఫైనల్‌లో సదరన్ బ్రేవ్‌పై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన ఓవల్ ఇన్‌విన్సిబుల్స్...

Southern Brave Team Wins The Hundred Title, Oval Invisibles Team Wins Female Title
Author
India, First Published Aug 22, 2021, 12:15 PM IST

‘ది హండ్రెస్’ 2021 సీజన్ విజేతగా సదరన్ బ్రేవ్ నిలిచింది. పురుషుల ఫైనల్‌లో బర్మింగ్‌హమ్ ఫోనిక్స్‌తో జరిగిన ఫైనల్‌లో 32 పరుగుల తేడాతో విజయం సాధించి, టైటిల్ సొంతం చేసుకుంది సదరన్ బ్రేవ్. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేక్, 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్‌ 36 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు..  169 పరుగుల టార్గెట్‌‌తో బరిలో దిగిన బర్మింగ్‌హమ్ ఫోనిక్స్ 135 పరుగులకే పరిమితమైంది. లియామ్ లివింగ్‌స్టోన్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు...

మహిళల ఫైనల్‌లో ఓవల్ ఇన్‌విన్సిబుల్స్, సదరన్ బ్రేవ్‌పై 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవల్ ఇన్‌విన్సిబుల్స్ 121 పరుగులు చేయగా, సదరన్ బ్రేవ్ 73 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు అనుగుణంగా తీసుకొచ్చిన కొత్త ఫార్మాట్ ‘ది హండ్రెడ్’.

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీ, అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయిందనే చెప్పాలి. ఆట ఆర్డినరీయే, ఫార్మాట్ కూడా ఆర్డినరీయే అంటూ భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...

Follow Us:
Download App:
  • android
  • ios