ఫీల్డింగ్‌లో అద్భుతమైన క్యాచులు అందుకుంటే, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో పోలుస్తారు. అలాంటి జాంటీ రోడ్స్‌యే అవాక్కయ్యేలా అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు సౌతాఫ్రికాకే చెందిన ఓ యంగ్ ప్లేయర్.

దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన అద్భుతమైన స్లిప్ క్యాచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్పిన్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ పడెల్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి వికెట్ కీపర్‌ని దాటి ముందుకు వెళ్లింది. అయితే బంతిని గమనించిన స్లిప్ ఫీల్డర్, లెగ్ సైడ్‌కి దూసుకొచ్చి గాల్లోకి ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు.

ఇంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ మార్టిన్ వాన్ జార్స్‌వెల్డ్‌ కూడా ఓ టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి క్యాచ్‌నే అందుకున్నాడు. వార్ జార్స్‌వెల్డ్ 9 టెస్టులు, 11 వన్డేలు మాత్రమే ఆడగా, అద్భుతమైన క్యాచ్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ ఫీల్డర్ గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.