Asianet News TeluguAsianet News Telugu

రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్... ఐపీఎల్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి...

Chris Morris Retirement: 34 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన... ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా మోరిస్ రికార్డు...

South Africa All-rounder Chris Morris announced Retirement for all-formats
Author
India, First Published Jan 11, 2022, 1:06 PM IST

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు క్రిస్ మోరిస్. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు క్రిస్ మోరిస్...

తన కెరీర్‌లో 4 టెస్టులు ఆడి 12 వికెట్లు తీసిన క్రిస్ మోరిస్, 42 వన్డేల్లో 48 వికెట్లు పడగొట్టాడు. 23 టీ20 మ్యాచుల్లో 34 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మూడు హాఫ్ సెంచరీలతో దాదాపు 800 పరుగులు చేశాడు...

క్రిస్ మోరిస్‌ని కెరీర్ ఆసాంతం గాయాలు వెంటాడాయి. గాయాలతో సతమతమవుతూ జట్టులోకి వస్తూ పోతుండేవాడు క్రిస్ మోరిస్. టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో క్రిస్ మోరిస్‌కి సౌతాఫ్రికా జట్టులో అవకాశం దక్కలేదు. 

సౌతాఫ్రికా దేశవాళీ ఫ్రాంఛైజీ టైటాన్స్‌ తరుపున ఫస్ట్ క్లాస్, లిస్టు ఏ క్రికెట్ ఆడిన క్రిస్ మోరిస్... 105 లిస్టు ఏ మ్యాచులు, 59 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 2535 పరుగులు చేసిన మోరిస్, 196 వికెట్లు పడగొట్టాడు...

ఐపీఎల్‌ చరిత్రలో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా క్రిస్ మోరిస్‌ రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2021 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.16.25 కోట్ల భారీ మొత్తానికి క్రిస్ మోరిస్‌ను దక్కించుకుంది.  2015 ఐపీఎల్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు నుంచి రూ.16 కోట్లు అందుకున్న యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు క్రిస్ మోరిస్...

 ‌గత ఏడాది ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున 11 మ్యాచులు ఆడిన క్రిస్ మోరిస్, 67 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. ఫస్టాఫ్‌లో మంచి పర్పామెన్స్ ఇచ్చిన క్రిస్ మోరిస్, యూఏఈలో జరిగిన సెకండ్ ఫేజ్‌లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు... 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chris Morris (@tipo_morris)

దక్షిణాఫ్రికా దేశవాళీ టీమ్ నార్త్ వెస్ట్‌తో పాటు హైవెల్డ్ లయర్స్, టైటాన్స్, సుర్రే, నెల్సన్ మండేలా బే జెయింట్స్, హంప్‌షైర్, సిడ్నీ థండర్ వంటి జట్ల తరుపున ఆడిన క్రిస్ మోరిస్... రిటైర్మెంట్ తర్వాత టైటాన్స్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు...

‘నేను, క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నా క్రికెట్ జర్నీ చాలా ఆనందంగా, సరదాగా సాగింది. టైటాన్స్ క్రికెట్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించబోతున్నాను. కోచ్‌గా నా బాధ్యతలు నిర్వర్తించడానికి ఎదురుచూస్తున్నా...’ అంటూ రాసుకొచ్చాడు క్రిస్ మోరిస్...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన క్రిస్ మోరిస్... రెండోసారి రాజస్థాన్ తరుపున ఆడి క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు...

Follow Us:
Download App:
  • android
  • ios