తన కూతురికి రాజకీయాలు తెలీవని... తనను ఈ విషయాల్లోకి లాగొద్దంటూ.... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో... పౌరసత్వ సవరణ చట్టం పై వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చట్టాన్ని వ్యతిరేకిస్తూ... పలు ప్రాంతాల్లో  ఆగ్రహజ్వాలలు వ్యక్తమౌతున్నాయి. కాగా... ఈ నేపథ్యంలో..సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ ... ఈ పౌరసత్వ చట్టంపై ఓ పోస్టు పెట్టిందంటూ వార్తలు వచ్చాయి.

ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో... ఈ ఘటనపై సౌరవ్ గంగూలీ స్పందించారు. తన కుమార్తెను ఇలాంటి విషయాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా గూంగూలీ మీడియాను కోరారు. సనా పెట్టినట్లు వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదని... అది ఆమె పోస్టు చేయలేదని గూంగూలీ వివరణ ఇచ్చారు. తన కుమార్తె చాలా చిన్న పిల్ల అని... తనకు ఇలాంటి రాజకీయాలు తెలియవని ఆయన చెప్పారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. కాగా... మంగళవారం సనా గూంగూలీ పేరిట ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... ఓ పోస్టు వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్రస్థాయిలో వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో.. గంగూలీ దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.