బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సారధ్యంలో... టీమిండియా బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్టుని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పింక్ బాల్ టెస్టులో విజయం టీమిండియానే వరించింది. ఈ సిరీస్ గెలవడానికి గంగూలీ నే కారణమని.. ఆయనను చూసే తాము నేర్చుకున్నామంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చెప్పారు. ఈ మ్యాచ్ కోసం గంగూలీ చాలానే కష్టపడ్డారు. అన్ని బాధ్యతలు తనపై వేసుకొని జట్టును ముందుకు నడిపించారు.

కాగా.. సిరీస్ గెలిచిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీకి ట్రోఫీ అందించే క్రమంలో దిగిన ఫోటోని గంగూలీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా... ఆ ఫోటోకి అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తే... ఆయన ముద్దుల కుమార్తె సనా గంగూలీ మాత్రం ఆయనను ట్రోల్ చేసింది.

ఎందుకంటే.. ఫోటోలో గంగూలీ కాస్త సీరియస్ గా కనిపిస్తున్నట్లు ఉంది. దీంతో సనా... ‘ మీకు అక్కడ ఏం నచ్చలేదు..?’ అని కామెంట్ చేసింది. దానికి పక్కన ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఓ ఎమోజీని పెట్టింది. కాగా... కూతురు కామెంట్ కి గంగూలీ కూడా సరదాగా స్పందించాడు. ‘‘ నువ్వు చెప్పిన మాట వినకుండా తయారౌతున్నావు’’ అంటూ గంగూలీ రిప్లై ఇచ్చారు. దానికి కూడా సనా మళ్లీ స్పందించింది. మీ నుంచే నేర్చుకుంటున్నాను అంటూ స్మైలీ ఎమోజీ, డ్యాన్సింగ్ ఎమోజీ పెట్టింది.

కాగా... ఈ తండ్రి,కూతుళ్ల సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. కాగా... కొందరు సనా గంగూలీని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. గంగూలీ లాంటి తండ్రి నీకు దొరకడం అదృష్టం అంటూ కొందరు సనాకి చెబుతుండటం విశేషం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SOURAV GANGULY (@souravganguly) on Nov 24, 2019 at 5:53am PST