Asianet News TeluguAsianet News Telugu

ఐసీసీ ఛైర్మన్ రేసులో గంగూలీ

ఇటీవలే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా... తాజాగా క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ కూడా ఐసీసీ  చైర్మన్‌ పదవికి గంగూలీ సరైన అభ్యర్థి అని వ్యాఖ్యానించాడు.
 

Sourav Ganguly Front-Runner to Replace Shashank Manohar as ICC Chairman?
Author
Hyderabad, First Published May 22, 2020, 11:15 AM IST

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఐసీసీ( అంతర్జాతీయ క్రికెట్ మండలి) రేసులోకి దూసుకెళుతున్నాడు. ఈ మేరకు గంగూలీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే సభ్యదేశాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా సఫారీలో టి20 సిరీస్‌కు ఓకే చెప్పాడు. అలాగే సౌరవ్‌ పేరును ప్రతిపాదించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతోంది. 

ఇటీవలే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా... తాజాగా క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ కూడా ఐసీసీ  చైర్మన్‌ పదవికి గంగూలీ సరైన అభ్యర్థి అని వ్యాఖ్యానించాడు.

స్మిత్‌తో పాటు సీఈవో జాక్వెస్‌ పాల్‌ కూడా భారత మాజీ కెప్టెన్‌కు మద్దతునిచ్చారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ఈనెలతో ముగియనుంది. కరోనా నేపథ్యంలో మనోహర్‌ మరో రెండు నెలలపాటు ఈ బాధ్యతల్ని మోయనున్నారు. అయితే ఆయన తర్వాత ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌ మాజీ చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఐసీసీ చైర్మన్‌ పదవి బరిలో ఉండగా... స్మిత్‌ బహిరంగ మద్దతుతో అనూహ్యంగా గంగూలీ రేసులోకొచ్చాడు. 

‘ఐసీసీ చైర్మన్‌గా గంగూలీలాంటి వారుంటే మంచిది. అతను అత్యున్నత స్థాయిలో క్రికెట్‌ ఆడాడు. గంగూలీ వల్ల ఆటకు లబ్ది కలుగుతుంది. అతని నాయకత్వ లక్షణాలు, క్రికెట్‌ పరిజ్ఞానం చైర్మన్‌గా విజయవంతమయ్యేందుకు దోహదం చేస్తాయి’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios