Asianet News TeluguAsianet News Telugu

దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 మ్యాచ్... స్టేడియంలోకి పాము...!

మ్యాచ్ మధ్యలో.. పాము గ్రౌండ్ లోకి పాక్కుంటూ రావడం గమనార్హం. ఈ పాము నుంచి గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఒక్కసారిగా భయపడిపోయారు. దీంతో.. కాసేపు మ్యాచ్ ని ఆపేయాల్సి వచ్చింది.
 

Snake In Guwahati Stadium Stops Play In 2nd India vs South Africa T20I
Author
First Published Oct 3, 2022, 9:42 AM IST

గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా... ఆదివారం భారత్- దక్షిణాఫ్రికా జట్లు రెండో టీ20 మయాచ్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో... అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా... ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

మ్యాచ్ చూడటానికి అభిమానులు వేల సంఖ్యలో రాగా.. స్టేడియంలోకి ఓ పాము కూడా రావడం గమనార్హం. మ్యాచ్ మధ్యలో.. పాము గ్రౌండ్ లోకి పాక్కుంటూ రావడం గమనార్హం. ఈ పాము నుంచి గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఒక్కసారిగా భయపడిపోయారు. దీంతో.. కాసేపు మ్యాచ్ ని ఆపేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత.. సిబ్బంది గ్రౌండ్ లోకి అడుగుపెట్టి.. పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాము స్టేడియంలోకి వచ్చిన సమయంలో.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ ఉండటం గమనార్హం. దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఫీల్డింగ్ చేస్తున్నారు. అనుకోకుండా గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన పాము ను సిబ్బంది పట్టుకోవడంతో.. వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, డికాక్ నవ్వుతూ కనిపించడం విశేషం. 

 

అయితే.... మైదానంలోకి పాము రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మ్యాచ్ కోసం గ్రౌండ్ ని ఫైనల్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది పాము రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. 

ఈ సంగతి పక్కన పెడితే... ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. అంతకముందు తిరువనంత పురంలో జరిగిన తొలి మ్యాచ్ లోనూ విజయం భారత్ నే వరించింది. వరసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచి.. మూడో మ్యాచ్ జరగకముందే... టీమిండియా సిరీస్ కైవసం చేసుకోవడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios