Asianet News TeluguAsianet News Telugu

WIPL: ఆ స్టార్ట్ అయ్యేసరికి చూద్దాం లే! ఉమెన్స్ ఐపీఎల్ పై మంధాన రెస్పాన్స్ పై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు

Women's IPL: గత కొంతకాలంగా  ‘ఇక ప్రారంభిస్తాం’ అంటూ ఊరిస్తున్న మహిళల ఐపీఎల్ ఎట్టకేలకు వచ్చే ఏడాది  జరుగనుంది (?) అని  వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. కానీ తాజాగా.. 

Smriti Mandhana's Response Goes Viral After She Asked About WIPL
Author
First Published Aug 15, 2022, 12:07 PM IST

గడిచిన నాలుగైదు సీజన్లుగా ఇండియాలో ఉమెన్స్ ఐపీఎల్ పై చర్చ జరుగుతూనే ఉంది. ‘ఇక వచ్చే ఏడాది  ప్రారంభిస్తాం..’ అని బీసీసీఐ చెప్పడమే తప్ప ఇప్పటివరకు అందుకు సంబంధించిన కీలక అడుగులు పడలేదు. కానీ కొద్దిరోజుల క్రితం నుంచి  ఈ లీగ్ పై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023లో మహిళల ఐపీఎల్ ను ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నదని  మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ స్మృతి మంధానను  ఇదే ప్రశ్న  అడగ్గా.. ఆమె సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. 

‘ది హండ్రెడ్’ లీగ్ లో భాగంగా సౌతర్న్ బ్రేవ్ తరఫున ఆడుతున్న మంధానకు ఈ ప్రశ్న ఎదురైంది. ఓవల్ ఇన్విజిబుల్స్ తో మ్యాచ్ అనంతరం రిపోర్టర్లు ఆమెను ఈ ప్రశ్న అడిగారు.  ‘వచ్చే ఏడాది ఉమెన్స్ ఐపీఎల్  ప్రారంభం కాబోతుంది. మీ నుంచి ఇదే ఉత్సాహం, ఆటను మేం అక్కడ కూడా ఊహించొచ్చా..?’ అని ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు మంధాన సమాధానం చెబుతూ..  ‘ఇండియాలో క్రికెట్ ను చాలా ఇష్టపడతారు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా మేం ఏ మ్యాచ్ ఆడినా మాకు మద్దతునిస్తారు. ఇండియాలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు మాలో తెలియని ఉత్సాహం ఉంటుంది. మహిళల ఐపీఎల్ ప్రారంభమవుతుండటం గొప్ప విషయం..’ అని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

అయితే ఈ సమాధానానికి ముందు మంధాన   ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళల ఐపీఎల్ గురించి అడగగానే ఆమె.. ముసిముసి నవ్వుతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్  పై సోషల్ మీడియాలో  జోకులు పేలుతున్నాయి. మంధాన ఎక్స్‌ప్రెషన్ పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఆ.. అది జరిగేవరకు చూద్దాంలే..’, ‘మూడేండ్లుగా ఇదే వింటున్నాం.  అది స్టార్ట్ అయ్యేవరకు చూద్దాం..’, ‘ఇదే ప్రశ్న మూడేండ్లుగా వింటున్నా.. మళ్లీ అదే ప్రశ్ననా....’ అన్నట్టుగా ముఖం పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలాఉండగా  వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్  ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది. ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఉమెన్స్ ఐపీఎల్ ను మార్చిలో నిర్వహించాలని భావిస్తున్నాం. ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ అనుగుణంగానే గాక లాజిస్టికల్ గా కూడా ఇది మాకు సాయపడుతుంది. ఇది ముగిసిన వెంటనే ఐపీఎల్ నూ ప్రారంభించొచ్చు..’ అని తెలిపాడు. గతంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

ఉమెన్స్ ఐపీఎల్ గురించి.. 

- ఆరు ఫ్రాంచైజీలతో ఆడనున్నారు. ఐపీఎల్ లో ఫ్రాంచైజీలను దక్కించుకున్న ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటికే ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. బీసీసీఐ కూడా వాళ్లకే తొలి ప్రాధాన్యం అని తెలిపింది. ఈ ఏడాది చివర్లో వేలం జరిగే అవకాశమున్నట్టు సమాచారం. 
- త్వరలోనే ఫ్రాంచైజీల బిడ్ ఉండనున్నట్టు సమాచారం. ఐపీఎల్ లో వేలం మాదిరిగానే ఇక్కడ కూడా  ప్లేయర్లను యాక్షన్ ద్వారా తీసుకోనున్నారు. 
- రెండు వారాలు సాగే ఈ టోర్నీలో 19 మ్యాచులు ఉండనున్నాయి. 
- ఒక్కో జట్టు  రెండు మ్యాచులు ఆడుతుంది. లీగ్ దశ, ప్లేఆఫ్స్, ఫైనల్ దశలో మ్యాచులుంటాయి. 
- లీగ్ దశలో టాప్-4గా నిలిచిన జట్లు ప్లేఆఫ్ చేరతాయి. అందులో టాప్-2 టీమ్స్ ఫైనల్ ఆడతాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios