SL vs ZIM ODI Series:  శ్రీలంక-జింబాబ్వే తొలి వ‌న్డేలో టాస్ గెలిచిన శ్రీలంక కొత్త కెప్టెన్ కుశాల్ మెండిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో అస‌లంక సెంచ‌రీ కొట్ట‌గా, కుశాల్ మెండిస్ (46), సమరవిక్రమ (41) లంక ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపించారు. 

Sri Lanka vs Zimbabwe ODI Series: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జింబాబ్వేతో జరగాల్సిన తొలి వన్డే వర్షార్ప‌ణం అయింది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో నిరాశపరిచిన శ్రీలంక జట్టు కొత్త ఆటగాళ్లతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. చరిత్ అసలంక సెంచరీతో అద‌ర‌గొట్టాడు. కానీ, మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో అత‌ని సెంచ‌రీ వృధా అయింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక కొత్త కెప్టెన్ కుశాల్ మెండిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆల్ రౌండర్ జెనిత్ లియానాజ్ శ్రీలంక తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలి ఓవర్లోనే శ్రీలంకకు షాక్ తగిలింది. అవిష్కా ఫెర్నాండో గోల్డెన్ డక్ ఔటయ్యాడు. కుశాల్ మెండిస్ (46), సమరవిక్రమ (41) లంక ఇన్నింగ్స్ ను హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించారు.

MS Dhoni: హుక్కా పీలుస్తూ.. ధోనీ వీడియో వైర‌ల్.. కెప్టెన్ కూల్ పై విమ‌ర్శ‌లు

కుశాల్, సదీర సమరవిక్రమ రెండో వికెట్ కు 63 పరుగులు జోడించి లంకను మెరుగైన స్థితిలోకి తీసుకువ‌చ్చాడు. అయితే అసలంక తన మూడో వన్డే సెంచరీ సాధిస్తూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. గాయం నుంచి కోలుకున్న దసున్ షనక, అరచిగే పెద్దగా ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.

అసలంక 95 బంతుల్లో 101 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో నగరవా, ముజరబానీ, ఫరాజ్ తలో రెండు వికెట్లు తీశారు. సికిందర్ రజాకు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే పేలవంగా ఆరంభించింది. మూడో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి జింబాబ్వే ఇన్నింగ్స్ ను షేక్ చేశాడు దిల్షాన్ మదుశంక. అయితే నాలుగో ఓవర్ ముగిసే సరికి వర్షం కుర‌వ‌డం షురూ అయింది. దీంతో జింబాబ్వే 4 ఓవర్లలో 12 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. వ‌ర్షం ఆగ‌క‌పోవ‌డంతో మ్యాచ్ ర‌ద్దు అయింది.

వింటేజ్ రైడ్ లో ర‌వీంద్ర జ‌డేజా.. ఎద్దుల బండి నడుపుతున్న వీడియో వైరల్.. !