చేతిలో పువ్వు పట్టుకున్నట్టు కూర్చున్నాడు! ఎందుకని అడిగితే... ఫేమస్ డ్రాప్ క్యాచ్‌పై షోయబ్ మాలిక్...

2008లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో క్యాచ్‌ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించని పాక్ ఫీల్డర్లు షోయబ్ మాలిక్, సయిద్ అజ్మల్.. 

Shoaib Malik reveals Saeed Ajmal reaction after famous drop catch, Virat Kohli question CRA

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ పేరు చెప్పగానే ఇంజమామ్ ఉల్ హక్, షోయబ్ అక్తర్, మహమ్మద్ ఆమీర్, యూనిస్ ఖాన్, బాబర్ ఆజమ్ వంటి ప్లేయర్ల కంటే ఎక్కువగా వారి మిస్ ఫీల్డింగ్ విన్యాసాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా 2008లో పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గాల్లోకి లేచిన బంతి, సయిద్ అజ్మల్- యూనిస్ ఖాన్ మధ్య పడింది. 

ఇద్దరు ఫీల్డర్లు బంతికి దగ్గరగా ఉన్నా, క్యాచ్ అందుకోలేకపోవడం చూసి పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతే, మిగిలినవాళ్లంతా నవ్వుకున్నారు. ఇప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఫీల్డింగ్ గురించి మాట్లాడితే ట్రోలింగ్ రావడానికి ఈ డ్రాప్ క్యాచ్ ప్రధాన కారణం..

‘వాయిస్ ఆఫ్ క్రికెట్’ అనే ప్రోగ్రామ్‌లో ఈ డ్రాప్ క్యాచ్ గురించి మాట్లాడాడు షోయబ్ మాలిక్.. ఈ సంఘటన తర్వాత ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కలిశాను. అతను దీని గురించి అడిగాడు..

 

‘‘క్యాచ్ డ్రాప్ చేయడం సర్వ సాధారణం. అయితే డ్రాప్ క్యాచ్ తర్వాత అజ్మల్ నీతో ఏమన్నాడు?’ అని విరాట్ నన్ను అడిగాను. క్యాచ్ పట్టుకోకపోతే క్యాచింగ్ పొజిషన్‌లో ఎందుకు కూర్చున్నావ్? అని అజ్మల్‌ని అడిగాను. దానికి అతను నువ్వు క్యాచ్ పట్టుకుని, డ్రాప్ చేస్తే దాన్ని పట్టుకునేందుకు అలా కూర్చున్నానని చెప్పాడు.. నా సమాధానం విని, విరాట్ కోహ్లీ పగలబడి నవ్వేశాడు.. ఇప్పటికీ ఆ సంఘటనను గుర్తు చేసుకున్న ప్రతిసారీ నాకు నవ్వు వస్తుంది..

అజ్మల్ పొజిషన్ చూసినప్పుడల్లా చేతిలో పువ్వు పట్టుకుని, ప్రపోజ్ చేయడానికి కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది...’’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్..
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios