భారత్ తో టీ20 సిరీస్... మ్యాచ్ కి ముందే కివీస్ కి షాక్

ఈ కీలక సిరీస్ కు ముందు ఆతిథ్య కివీస్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, ఫెర్గుసన్ లు గాయం కారణంగా టీ20కి దూరమయ్యారు.ఈ ఇద్దరు దూరమవడంతో టీ20 సిరీస్‌ కోసం గురువారం ప్రకటించిన కివీస్‌ జట్టులో అనూహ్యంగా 32 ఏళ్ల బెనెట్‌కు అవకాశం కల్పించారు. 
 
New Zealand announce strong 14-man squad for T20I series against India

ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో రెండు జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే.. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ సిరీస్ ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ కీలక సిరీస్ కు ముందు ఆతిథ్య కివీస్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, ఫెర్గుసన్ లు గాయం కారణంగా టీ20కి దూరమయ్యారు.ఈ ఇద్దరు దూరమవడంతో టీ20 సిరీస్‌ కోసం గురువారం ప్రకటించిన కివీస్‌ జట్టులో అనూహ్యంగా 32 ఏళ్ల బెనెట్‌కు అవకాశం కల్పించారు. 

Also Read హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ కు బీసీసీఐ బిగ్ షాక్.

బెనెట్‌ గత రెండేళ్లలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడకపోవడం గమనార్హం. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని 14 మంది ఆటగాళ్ల జాబితాలో సీనియర్‌ ఆటగాళ్లు మార్టిన్‌ గప్టిల్‌, రాస్‌ టేలర్‌, కొలిన్‌ మున్రో, కొలిన్‌ డి గ్రాండ్‌ హోమ్‌లు చోటు దక్కించుకున్నారు. ఈ నెల 24న జరగబోయే తొలి టీ20తో కివీస్‌ పర్యటనను టీమిండియా ప్రారంభించనుంది.  

న్యూజిలాండ్‌ టీ 20 జట్టు
కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్టిన్‌ గప్తిల్, కొలిన్‌ మున్రో, టేలర్, గ్రాండ్‌హోమ్, బ్లైర్‌ టిక్నర్, మిచెల్‌ శాంట్నర్, టిమ్‌ సైఫర్ట్‌ (వికెట్‌ కీపర్‌), ఇస్‌ సోధి, టిమ్‌ సౌథీ, హమీశ్‌ బెనెట్, టామ్‌ బ్రూసీ, కుగ్లీజిన్, డార్లీ మిచెల్‌. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios