Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్ లో నవ్వులపాలైన పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్... నెటిజన్ల సెటైర్లు

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ను పాకిస్థాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. నాటింగ్ హామ్ లో జరిగిన నిర్ణయాత్మక నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో పాక్ ఓటమిపాలయ్యింది. దీంతో సీరిస్ పై ఆశలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది.   పాక్ సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఈ  మ్యాచ్ లో విచిత్రంగా ఔటైయ్యాడు. ఔటయ్యాడు అనే బదులు  నవ్వులపాలయ్యాడు అంటే బావుంటుందేమో. ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు, సహచరులు, అభిమానులు కూడా అతడు ఔటైన విధానాన్ని చూసి  నవ్వు ఆపులేకపోయారు.  

Shoaib Malik Clatters His Own Stump
Author
England, First Published May 18, 2019, 2:50 PM IST

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ను పాకిస్థాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. నాటింగ్ హామ్ లో జరిగిన నిర్ణయాత్మక నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో పాక్ ఓటమిపాలయ్యింది. దీంతో సీరిస్ పై ఆశలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది.   పాక్ సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఈ  మ్యాచ్ లో విచిత్రంగా ఔటైయ్యాడు. ఔటయ్యాడు అనే బదులు  నవ్వులపాలయ్యాడు అంటే బావుంటుందేమో. ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు, సహచరులు, అభిమానులు కూడా అతడు ఔటైన విధానాన్ని చూసి  నవ్వు ఆపులేకపోయారు.  

ఇంతకు ఏం జరిగిందంటే: 

నాటింగ్ హామ్ వన్డేలో పాకిస్థాన్ మొదట పాకిస్థాన్  బ్యాటింగ్ కు దిగింది. టాప్ ఆర్డర్ రాణించడంతో ఆ  జట్టు బ్యాటింగ్ భారీ స్కోరు దిశగా సాగుతున్న సమయమది. అప్పుడు షోయబ్ మాలిక్ బ్యాటింగ్ కు దిగాడు. అయితే స్కోరు వేగాన్ని మరింతగా పెంచడానికి ప్రయత్నిస్తూ కేవలం 26 బంతుల్లోనే 41 పరుగులు చేసి మంచి ఊపుమీదున్నాడు. 

ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్  47 ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే మొదటి బంతికే బౌండరీ బాదిన మాలిక్ నాలుగో బంతికి కూడా  సేమ్ అలాగే భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. బ్యాక్  ఫుట్ తీసుకుని బంతిని కవర్స్‌ మీదుగా బౌండరీకి తరలిద్దామనుకున్నాడు. ఆ  ప్రయత్నంలో బంతిని కాకుండా వికెట్లను కొట్టుకుని ఔటయ్యాడు. అయితే బ్యాట్ పొరపాటున వికెట్లకు తాకినట్లుగా కాకుండా మూడు వికెట్లను గిరాటేసింది. ఈ సంఘటన  మైదానంలో వున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లనే కాదు ఈ మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నవ్వుకునేలా చేసింది. మాలిక్ హిట్ వికెట్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. 

ఈ  మ్యాచ్ లో పాక్ 340 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికి గెలవలేకపోయింది. ఓపెనర్ రాయ్ అద్భుతమైన సెంచరీకి స్టోక్స్ హాఫ్ సెంచరీ తోడవడంతో ఇంగ్లాండ్ మరో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు వన్డేల సీరిస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios