టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల గాయపడ్డారు. దేశవాళీ టోర్నీ సయ్యద్ మస్తాన్ అలీ టీ20 ట్రీఫీలో ఢిల్లీ తరపున శిఖర్ ధావన్ ఆడుతున్నాడు. ఈ ఆట మధ్యలో శిఖర్ ధావన్ మోకాలికి గాయమైంది. సూరత్ వేదికగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో 22 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ ల సహాయంతో 24 పరుగులు చేసిన ధావన్... అనంతరం ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. 

దీంతో ధావన్ ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ధావన్.. హాస్పిటల్ లోని వైద్యులందరితోకలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయా అవి వైరలయ్యాయి. 

‘ కింద పడుతుంటాం. తిరిగి లేస్తుంటాం. బాధలను అధిగమిస్తాం. పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నామన్నది ఒక్కటే మన చేతుల్లో ఉన్నది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ సానుకూలంగా, సంతోషంగా ఉండాలి. నాలుగైదు రోజుల్లో మళ్లీ మైదానంలోకి అడుగుపెడతా’ అంటూ ధావన్ తన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. కాగా... ధావన్  కామెంట్స్ కి హార్దిక్ పాండ్యా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.

‘‘ హ్హహ్హహ్హ.. ఆస్పత్రిలో అందరినీ క్యూర్ చేస్తున్నావా’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా.. పాండ్యా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.