తాము ఈ విజయానికి అర్హులమని ధావన్ పేర్కొన్నాడు. చెన్నైలో తమకు ఈ విజయం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు

డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ ని.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. కాగా.. ముంబయి పై విజయం సాధించడం పట్ల ఢిల్లీ టీం ఓపెనర్ శిఖర్ ధావన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. హాఫ్ సెంచరీ చేయకుండా అవుట్ అయ్యాననే చిన్న ఫీలింగ్ ఉందని.. కానీ.. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ధావన్ పేర్కొన్నాడు.

తాము ఈ విజయానికి అర్హులమని ధావన్ పేర్కొన్నాడు. చెన్నైలో తమకు ఈ విజయం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ ఫీలింగ్ వాఖండే రిజల్ట్ కి చాలా భిన్నంగా ఉందన్నాడు. ముంబయి ఇండియన్స్ వంటి జట్టుపై గెలవడం అంటే.. సహజంగానే తమలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని పేర్కొన్నాడు.

కానీ.. హాఫ్ సెంచరీ చేరువలో అవుట్ అయ్యాననే ఫీలింగ్ ఉందని.. కాకపోతే.. ఈ విజయం మరింత ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.

‘‘లలిత్‌ యాదవ్‌తో కలిసి నిలకడగా ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్న సమయంలో, ఫిఫ్టీ పూర్తి చేయకపోవడం కాస్త నిరాశకు గురిచేసింది. అయితే, ఎట్టకేలకు భారీ విజయం సాధించడం సంతోషాన్నిచ్చింది. మా ఆట తీరు బాగుంది. ఈ విజయానికి మేం పూర్తి అర్హులం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా సీజన్‌ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తున్న ధవన్‌.. ఈ మ్యాచ్‌లో 45 పరుగుల( 5 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో రాణించాడు. ప్రస్తుతం 231 పరుగులు పూర్తిచేసుకున్న గబ్బర్‌.. ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్‌ అనంతరం పంత్‌ బృందానికి ఘన స్వాగతం లభించింది.