సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లతో కలిసి దిగిన ఫోటో పోస్టు చేసిన శిఖర్ ధావన్...మార్చి 12 నుంచి టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియా...టెస్టు టీమ్‌తో కలిసిన టీ20 జట్టు ప్లేయర్లు... 

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు ఆడుతున్న టీమిండియా, ఈ నెల 12 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. బయో బబుల్ నిబంధనల కారణంగా సిరీస్ ఆరంభానికి వారం రోజుల ముందే టీ20 సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు అందరూ సెక్యూర్ జోన్‌లోకి వచ్చేశారు.

విజయ్ హాజారే ట్రోఫీ 2021 సిరీస్ కోసం బయో బబుల్‌లోనే గడిపిన ఆటగాళ్లు, భారత టెస్టు టీమ్‌తో కలిశారు...టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, మొట్టమొదటిసారిగా భారత జట్టుకి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశారు.

View post on Instagram

ఈ ఫోటోకి ‘లవ్‌లీ మీటింగ్’ అని కాప్షన్ పెట్టాడు ధావన్. రిషబ్ పంత్ నిన్న సెంచరీతో చెలరేగగా, రోహిత్ శర్మ 49 పరుగుల వద్ద అవుటైన విషయం తెలిసిందే.