టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహీన్ ఆఫ్రిదీ... కొత్త కెప్టెన్లను ప్రకటించిన పాకిస్తాన్...
టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్‌ని నియమించిన పీసీబీ, ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీకి టీ20 కెప్టెన్సీ... మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌ని టీమ్ డైరెక్టర్‌గా నియామకం..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని ఐదో స్థానంలో ముగించింది పాకిస్తాన్. 9 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న పాక్, సెమీ ఫైనల్ చేరలేకపోయింది. ఈ పరాభవం తర్వాత బాబర్ ఆజమ్, మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే..
తాజాగా బాబర్ ఆజమ్ ప్లేస్‌లో కొత్త కెప్టెన్లను ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్‌ని నియమించిన పీసీబీ, ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీకి టీ20 కెప్టెన్సీ అప్పగించింది..
వచ్చే ఏడాది నవంబర్ వరకూ వన్డే సిరీస్‌లు ఆడడం లేదు పాకిస్తాన్. వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ 2024 జరగబోతోంది. దీంతో వచ్చే 12 నెలల పాటు టీ20, టెస్టు సిరీస్‌లు మాత్రమే ఆడబోతోంది పాకిస్తాన్. దీంతో వచ్చే అక్టోబర్‌లో వన్డే కెప్టెన్‌ని నియమించే అవకాశం ఉంది..
గత ఏడాది షాన్ మసూద్‌కి వన్డేల్లో వైస్ కెప్టెన్సీ దక్కింది. అయితే వైస్ కెప్టెన్‌గా పీసీబీ ప్రకటించిన తర్వాత షాన్ మసూద్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాడు బాబర్ ఆజమ్. ఆ సమయంలో ఈ విషయంపై పెద్ద రాద్ధాంతమే జరిగింది..
34 ఏళ్ల షాన్ మసూద్, ఇప్పటిదాకా 30 టెస్టులు ఆడి 1597 పరుగులు చేశాడు. 2023-25 ఐసీసీ టెస్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ సీజన్‌కి షాన్ మసూద్, పాక్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టెస్టులు ఆడబోతోంది పాకిస్తాన్ క్రికెట్ టీమ్..
లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ, ఇప్పటిదాకా 52 టీ20 మ్యాచులు ఆడి 64 వికెట్లు తీశాడు. జనవరి 12 నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది పాకిస్తాన్. కెప్టెన్‌గా పాక్ సూపర్ లీగ్‌లో రెండు టైటిల్స్ గెలిచాడు షాహీన్.
మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌ని టీమ్ డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పీసీబీ.