Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ కు వస్తానంటే గంభీర్ కు దగ్గరుండి వీసా ఇప్పిస్తా: అఫ్రిది

ప్రస్తుతం భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొని వున్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలు  పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ అగాదాన్ని మరింత పెంచేలా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది- టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ల వివాదం చెలరేగుతోంది. వీరిద్దరి మధ్య మాటల యుద్దం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.దీంతో వీరి మధ్య మాటల యుద్దం కాస్తా రోజురోజుకు ముదిరి అభిమానుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే స్థాయికి చేరుకుంది.
 
Shahid Afridi hits back at Gautam Gambhir
Author
New Delhi, First Published May 6, 2019, 6:34 PM IST

ప్రస్తుతం భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొని వున్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలు  పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ అగాదాన్ని మరింత పెంచేలా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది- టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ల వివాదం చెలరేగుతోంది. వీరిద్దరి మధ్య మాటల యుద్దం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.దీంతో వీరి మధ్య మాటల యుద్దం కాస్తా రోజురోజుకు ముదిరి అభిమానుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే స్థాయికి చేరుకుంది.

వీరిద్దరి మధ్య వివాదానికి  అఫ్రిది ఆత్మకథ  ''గేమ్ చేంజర్'' కారణమయ్యింది. ఇందులో గంభీర్ బాగా పొగరుబోతు కలిగిన ఆటగాడిగా  అఫ్రిది పేర్కొన్నాడు. అతడికి క్రికెట్లో చెప్పుకోదగ్గ రికార్డులు లేవని...గొప్ప ఆటగాడేమీ కాదని ప్రొపెషనల్ మరియు వ్యక్తిగత విమర్శలు చేశాడు. 

తనపై అఫ్రీది చేసిన ఆరోపణలకు గంభీర్ ఘాటుగా స్పందించాడు. అఫ్రిదిని సైకియాట్రిస్ట్ ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశాడు. నువ్వో వింత మ‌నిషివి, మేం మెడిక‌ల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీల‌కు వీసాలు జారీ చేస్తున్నాం, వ్య‌క్తిగ‌తంగా నేనే నిన్ను మాన‌సిక వైద్యుడికి ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తానంటూ గంభీర్ ఇవాళ‌ త‌న ట్వీట్‌ను అఫ్రిదీకి ట్యాగ్ చేశాడు.

ఈ ట్వీట్ కు అఫ్రిది కూడా అంతే ఘాటుగా జవాభిచ్చాడు. '' ఏమో అనుకున్నా గానీ గంభీర్‌కు నిజంగా మతిస్థిమితం సరిగ్గా లేదు. అతను మా దేశం వస్తే నా హాస్పిటల్ లోనే స్పెషల్ ట్రీట్ మెంట్ చేయిస్తా. చికిత్స కోసం పాకిస్థాన్  కు రావడానికి వీసా సమస్యలేమైనా వస్తే నేను దగ్గరుండి ఇప్పిస్తా'' అని అఫ్రిది తెలిపాడు. ఇలా  వారిద్దరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios