సెయింట్ లూసియా: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మాత్రమే కాకుండా టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డును కూడా బద్దలు కొట్టింది. 15 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించిన భారత మహిళా ఓపెనర్ షపాలీ వర్మ టీ20లో రోహిత్ శర్మ రికార్డును అధిగమించింది. 

అంతర్జాతీయ టీ20ల్లో పిన్న వయస్సులో అర్థ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా ఆమె రికార్డును నమోదు చేసుకుంది. ఫఫాలీ వర్మ 15 ఏళ్ల 285 రోజుల వయస్సులో అంతర్జాతీయ టీ2ల్లో అర్థ సెంచరీ నమోదు చేసింది. అంతకు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరు మీద ఉంది. రోహిత్ శర్మ 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో టీ20ల్లో అర్థ సెంచరీ చేసి అతి పిన్న వయస్సులో ఆ ఘనత సాధించిన క్రికెటర్ గా రికార్డు నమోదు చేసుకున్నాడు. దాన్ని షఫాలీ బద్దలు కొట్టింది. 

Also Read: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన షపాలీ వర్మ.

ఇదిలావుంటే, ప్రపంచ మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అతి పిన్న వయస్సులో అర్థ సెంచరీ సాధించిన ఘనత యుఏఈకి చెందిన ఎగోదాజ్ పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానాన్ని షఫాలీ ఆక్రమించింది. ఎగోడాజ్ 15 ఏళ్ల 267 రోజుల వయస్సులో అర్థ సెంచరీ చేసింది. 

వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా జిరగిన తొలి మ్యాచులో మందానాతో కలిసి షఫాలీ 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దాంతో టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రికార్డును ఈ జంట నెలకొల్పింది. ఈ మ్యాచును భారత్ వెస్టిండీస్ పై 84 పరుగుల తేడాతో గెలుచుకుంది.