అలా వచ్చిన అభిమానులను సిబ్బంది అడ్డుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. అయితే.... ఆ సమయంలో క్రికెటర్ షమీ వ్యవహరించిన తీరుకి అభిమానులు ఫిదా అయిపోయారు.

నచ్చిన క్రికెటర్ కళ్లెదురుగా ఆట అదరగొడుతుంటే... వారిని కనీసం ఒక్కసారైనా దగ్గర నుంచి చూడాలని, వారితో మాట్లాడాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే... మైదానంలోకి అభిమానులను అనుమతించరు. లోపలికి రానివ్వరు. కానీ ఒక్కోసారి కొందరు అభిమానులు ఉత్సాహం తట్టుకోలేక.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి... లోపలికి అడుగుపెడుతూ ఉంటారు. అలా వచ్చిన అభిమానులను సిబ్బంది అడ్డుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. అయితే.... ఆ సమయంలో క్రికెటర్ షమీ వ్యవహరించిన తీరుకి అభిమానులు ఫిదా అయిపోయారు.

Scroll to load tweet…

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనూ ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో భద్రతా సిబ్బంది చూడకుండా ఆ యువకుడు బారీ కేడ్లు దూకి మరీ గ్రౌండ్ లోకి పరిగెత్తాడు. అయితే... అతనిని గమనించిన సిబ్బంది అడ్డుకున్నారు.

సదరు యువకుడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానిని గమనించి అక్కడకు వెళ్లిన టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ... సెక్యూరిటీని అడ్డుకున్నారు. యవకుడిని లాక్కెళ్లకుండా.. నమ్మదిగా తీసుకువెళ్లాలని సూచించాడు. ఆ యువకుడితో ప్రేమగా మాట్లాడి.. అక్కడి నుంచి పంపించాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా... అభిమానులు ఫిదా అవుతున్నారు. షమీది ఎంత మంచి మనసు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.